మరో మూడు రోజులలో సాయి ధరమ్ తేజ్ ‘ఇంటలిజెంట్’ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కాపు సామాజిక వర్గానికి ఆయువుపట్టుగా పరిగణించే తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో జరగడం వెనుక ఇప్పుడు ఒక రాజకీయ కోణం కనిపిస్తోంది అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వెనుక ఏవో వ్యూహాల రచన జరుగుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాధారణంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫిలిం ఫంక్షన్స్ కు జరిగే స్థాయిలో ఒక భారీ ఫిలిం ఫంక్షన్ సాయి ధరమ్ తేజ్ ‘ఇంటలిజెంట్’ మూవీకి రాజమండ్రిలో జరుగుతూ ఉండటం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  

VINAYAK ALONG WITH SAIDHRAM TEJ PHOTOS కోసం చిత్ర ఫలితం
ఒక యంగ్ మెగా హీరో మూవీకి సంబంధించిన ఈ ఫిలిం ఫంక్షన్ కు సంబంధించి విశాఖ గాజువాక నుంచి రాజమండ్రి మధ్యలో వున్న చాలా ఊళ్లలో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈఫంక్షన్ నిర్వాహణ అంతా కొంతమంది మెగా ఫ్యాన్స్ నాయకుల ఆద్వర్యంలో జరుగుతూ ఉండటంతో ఈఫంక్షన్స్ కు సబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పై మెగా హీరోల ఫోటోలతో పాటు పవన్ చిరంజీవిల ఫోటోలు చాల ప్రముఖంగా కనిపిస్తూ ఉండటంతో ఇదిసినిమా ఫంక్షన్ అనుకోవాలా ? లేదంటే మెగా కుటుంబ స్టామినాను తెలిపే ఫంక్షన్ అనుకోవాలా అని అభిప్రాయపడే విధంగా ఈ ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. 

VV VINAYAK LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా రాజమండ్రిలో జరుగుతున్న ఈ ఫంక్షన్ చేయడంవెనుక దర్శకుడు వివి వినాయక్ రాజకీయ ఆకాంక్షలు దాగి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలలో వినాయక్ హవా తగ్గిన తరువాత వినాయక్ రాజకీయాలలోకి వస్తాడు అన్న ప్రచారం గతకొంత కాలంగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థుతులలో వినాయక్ రాజమండ్రి నుండి ‘జనసేన’ తరఫున పోటీ చేసే ఉద్దేశ్యంతో ఈ కాపు సామాజిక వర్గ జనసమీకరణ జరుగుతోంది అని కొందరంటున్నారు. 
CHIRANJEEVI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవిని అతిధిగా తీసుకు రావాలని వినాయక్ సాయి ధరమ్ తేజ్ లు చాల పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నాట్లు తెలుస్తోంది. ఒక యంగ్ హీరో ఫిలిం ఫంక్షన్ ను రాజముండ్రి లాంటి చైతన్యంకల ఊరిలో ఒక బహిరంగ ఫంక్షన్ లా జరపడం వెనుక ఎదో ఒక సీక్రెట్ ఎజెండా ఉంది అన్న గాసిప్పులు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: