గత సంవత్సరం సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఒకేసారి రిలీజ్ అయి మెగా నందమూరి అభిమానుల మధ్య టెన్షన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలకు ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ఇవ్వడంతో క్రితం సంవత్సరం సంక్రాంతి రేసులో చిరంజీవి బాలకృష్ణలు వారివారి స్థాయిలో విజేతలుగా నిలిచారు.

 SAIRA MOVIE POSTERS కోసం చిత్ర ఫలితం

 అయితే వచ్చే సంవత్సరం మళ్ళీ మెగా నందమూరి వార్ జరగడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా’ పనులతో బిజీగా ఉంటే త్వరలో ప్రారంభం కానున్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ పనులతో ప్రస్తుతం బాలయ్య కూడా బిజీగా ఉంటున్నాడు. ‘సైరా’ సినిమాను సుమారు 150 కోట్ల బడ్జెట్ తో చిరంజీవి రామ్ చరణ్ చేత సొంతంగా నిర్మింప చేస్తూ ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ కు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా బాలకృష్ణ సుమారు 60 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్నాడు.

 BALAKRISHNA IN NTR BIO PIC PHOTOS కోసం చిత్ర ఫలితం

 ఈ రెండు సినిమాల నిర్మాణ విషయాలు ఇప్పటినుంచే అన్ని విషయాల్లోనూ పోటీ పడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘సైరా’ ను వచ్చే ఏడాది సమ్మర్ నాటికి విడుదల చేయాలని ఇప్పటికే చిరంజీవి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.అదేవిధంగా ఎన్టీఆర్ బయోపిక్ ను కూడ బాలకృష్ణ వచ్చే ఏడాది సమ్మర్ రేసుకు 2019 ఎన్నికల ముందు విడుదల చేయాలన్నది బాలయ్య ప్లాన్ అని అంటున్నారు.

BALAKRISHNA ALONG WITH CHIRANJEEVI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

  అయితే ఎన్నికలు మరీ ముందుగా వస్తే బాలకృష్ణ యాక్షన్ ప్లాన్ మారే అవకాశం ఉంది అని టాక్. దీనితో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మళ్ళీ బాలకృష్ణ చిరంజీవిల మధ్య డైరెక్ట్ ఫైట్ ఈసినిమాల నిమిత్తం జరగడం ఖాయం అని అంటున్నారు. చిరంజీవి బాలకృష్ణల కెరియర్ లకు సంబంధించి ఒక మైలురాళ్ళుగా మారుతున్న ఈ రెండు చారిత్రాత్మక సినిమాలు ఇంచుమించు ఒకే సమయంలో విడుదల కాబోతు ఉండటం యాదృశ్చికం అయినా అభిమానులు మాత్రం మెగా నందమూరి వార్ గానే పరిగణిస్తారు.. 


 

 


మరింత సమాచారం తెలుసుకోండి: