సినిమా అంటే ఓ రంగుల ప్రపంచం..ఒక్కసారి తెరపై కనిపిస్తే..సెలబ్రెటీలు అవుతారని..సొసైటీలో ప్రత్యేక గౌరవం లభిస్తుందని ఎంతో మంది భావిస్తుంటారు. అయితే తెరపై కనిపించినంత వరకే తారలు తళుక్కుమంటారు..తెర వెనుక వారి జీవితాలో ఎన్నో కష్టాలు..నష్టాలు..బాధలు..కన్నీళ్లు ఉంటాయని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి.  ఇక భారతీయ చలన చిత్ర రంగంలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి...మంచి పేరు సంపాదించింది. తర్వాత పదహారేళ్లవయసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి..అతి తక్కువ కాలంలోనే..మహానటులు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో మూడు తరాల హీరోలతో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఘనత ఒక్క శ్రీదేవి కే దక్కుతుంది. అయితే శ్రీదేవి అగ్రతారగా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా..ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందన్న విషయం కొద్ది మందికే తెలుసు.  శ్రీ‌దేవి ఇష్ట‌పూర్వ‌కంగా.. స్వాధీనంలో జీవ‌నం సాగించలేద‌ని వెల్ల‌డ‌వుతోంది.  శ్రీ‌దేవి అభిమానుల‌కు రామ్‌గోపాల్ వ‌ర్మ రాసుకొచ్చిన ప్రేమ‌లేఖ ప‌లు సంచ‌ల‌నాత్మ‌క విష‌యాల్ని వెల్ల‌డించింది. 

బాలనటిగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి శ్రీదేవి తల్లి రాజేశ్వ‌రి అన్ని బాధ్యతలు చూసుకుంటూ వచ్చేది. కెరీర్ ఆరంభం నుంచి శ్రీ‌దేవి ఆర్థిక వ్య‌వ‌హారాల్ని త‌ల్లి రాజేశ్వ‌రి అయ్యంగార్‌ చూసుకునేవారు. తాను చేసిన అనుభ‌వం లేని ప‌నుల వ‌ల్ల డ‌బ్బు, ఆస్తుల్ని పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. త‌ల్లి రాజేశ్వ‌రి అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరిన క్ర‌మంలో శ్రీ‌దేవి పేరు మీద‌కు ఆస్తుల్ని మారుస్తూ త‌ల్లి సంత‌కం చేశారు.  ఆ సమయంలో శ్రీదేవి చెల్లెలు శ్రీలత సంచలన క్రియేట్ చేసింది. తన తల్లి మానసిక పరిస్థితి బాగాలేని సమయంలో ఆస్తి రాయించుకుందని శ్రీదేవిపై పోలీసు కేసు పెట్టంది. ఆ క్ర‌మంలోనే శ్రీ‌దేవి త‌ల్లిని ఆస్ప‌త్రిలో చేర్చేప్పుడు త‌న వెంట నిర్మాత‌ బోనిక‌పూర్ ఉన్నాడు.  అప్పటికీ బోనీకపూర్ భర్త హోదాలో లేరు.
Image result for rgv love letter about sridevi
  శ్రీదేవికి కెమెరా ముందు నటించడం ఒక్కటే తెలుసని..ఆమెది చిన్న పిల్ల మనస్థత్వం అని వర్మ తన లేఖలో పేర్కొన్నారు.  ఆ క్ర‌మంలోనే బోనీని శ్రీ‌దేవి పెళ్లాడ‌డం అత‌డి కుటుంబంలో ఎవ‌రికీ ఇష్టం లేదు.క్ష‌ణ‌క్ష‌ణం, గోవిందా గోవిందా చిత్రాలకు శ్రీ‌దేవితో క‌లిసి ప‌ని చేసిన‌ప్పుడు త‌న‌ ప‌ర్స‌న‌ల్ లైఫ్ చూశాను. శ్రీ‌దేవి వ్య‌క్తిగ‌త జీవితం సినీజీవితంతో పోలిస్తే డిఫ‌రెంట్ అని అర్థ‌మైంది. శ్రీదేవి తండ్రి ఉన్నంత కాలం ఎంతో స్వేచ్చగా ఉండేదని..ఆయన అకాల మరణం తర్వాత ఆటుపోట్లు ప్రారంభం అయ్యాయని అన్నారు. శ్రీ‌దేవి త‌ల్లి ఓవ‌ర్ ప్రొటెక్టివ్‌! అని వ‌ర్మ వ్యాఖ్యానించారు.  అప్ప‌టి రోజుల్లో క‌థానాయిక‌ల‌కు బ్లాక్ మ‌నీ రూపంలోనే నిర్మాత‌లు చెల్లింపులు చేసేవారు. ఆ క్ర‌మంలోనే ఇన్‌కం ట్యాక్స్ రెయిడ్స్ ఉంటాయ‌ని శ్రీ‌దేవి తండ్రి బంధుమిత్రుల్ని న‌మ్మి ఆస్తుల విష‌యంలో సంబంధాలు పెట్టుకున్నారు.
Image result for rgv love letter about sridevi
ఆయన చనిపోయిన తర్వాత బంధువులు శ్రీదేవికి యాంటీగా మారారని..డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. అంతే కాదు శ్రీదేవి తల్లి తెలిసీ తెలియక రాంగ్ ఇన్వెస్టిమెంట్స్ చేయ‌డం ద్వారా ఒక్క రూపాయి కూడా లేని ధీన స్థితికి తెచ్చింది. అప్ప‌టికే అప్పుల్లో ఉన్న బోని క‌పూర్ .. అప్పుల్లో ఉన్న శ్రీ‌దేవిని ఓదార్చ‌డం త‌ప్ప ఇంకేమీ చేయ‌లేని స్థితిలో ఉండేవాడు.. అంటూ ఎన్నో సంచ‌ల‌న విష‌యాల్ని ఈ లేఖ‌లో వెల్ల‌డించారు రాంగోపాల్ వర్మ. అంతేకాదు అమెరికాలో శ్రీ‌దేవి త‌ల్లికి రాంగ్ సైడ్ బ్రెయిన్‌ స‌ర్జ‌రీ చేయ‌డం వ‌ల్ల‌నే మ‌తిస్థిమితం కోల్పోయారు.   శ్రీలత తెలిసిన వారితో వివాహం జరిగిపోయింది. 
Image result for sridevi childhood days
ఆ పెళ్లి త‌ర్వాత ఆస్తుల సెటిల్‌మెంట్ విష‌యంలో మ‌తిస్థిమితం లేని త‌ల్లి నుంచి త‌న సోద‌రి శ్రీ‌దేవి సంత‌కం చేయించుకుంద‌ని ఆరోపిస్తూ పోలీసుల్ని ఆశ్ర‌యించింది. దాంతో ఎంతో ప్రేమగా ఉన్న సోదరి ఒక్కసారి ఇలా చేయడంతో మానసిక వేదనకు గురయ్యింది శ్రీదేవి. ఇలా ఇలాంటి ఒత్తిళ్లు, ఇన్‌సెక్యూరిటీ మ‌ధ్య శ్రీ‌దేవి త‌న జీవితాంతం భ‌య‌ప‌డుతూనే బ‌తికార‌ని ఆర్జీవీ ఈ లేఖ‌లో పేర్కొన్నారు.
Image result for sridevi sister
చాలా చిన్న‌వ‌య‌సులోనే శ్రీ‌దేవి త‌న‌కు ద‌క్కిన అసాధార‌ణ పేరుప్ర‌ఖ్యాతులు త‌న‌ని స్వ‌తంత్య్ర మ‌హిళ‌గా ఉండ‌నివ్వ‌లేదు. నిజ‌జీవితంలో తాను ఏం కోరుకుంటుందో అది కాలేక‌పోయింద‌ని వర్మ సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. తాను ఎదుర్కొన్న అసాధార‌ణ ప‌రిస్థితుల వ‌ల్ల కెమెరా ముందు మాత్ర‌మే కాదు.. కెమెరా వెన‌క కూడా న‌టిస్తూ బ‌త‌కాల్సొచ్చింద‌ని వ‌ర్మ లేఖ‌లో తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: