టాలీవుడ్ లో ‘ఇడియట్’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవితేజ తర్వాత వరుస విజయాలతో మంచి ఫామ్ లోకి వచ్చాడు.  ఎన్నో సూపర్ హిట్ సినిలు చేసిన రవితేజ అభిమానులు మాస్ మహరాజ గా పిలుస్తారు.  బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘పవర్’ సినిమా తర్వాత రవితేజకు వరుస ఫ్లాపులు చవిచూశారు. 
Image result for raviteja nalaticket
దాంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ‘రాజా ది గ్రేట్’ సినిమాతో ఘన విజయం సాధించాడు.  ఇదే ఊపు మీద ‘టచ్ చేసి చూడు’ సినిమా తీశాడు..కానీ ఇది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెకెక్కుతున్న‘ నేల టికెట్’ సినిమాలో నటిస్తున్నాడు మాస్ మహరాజ రవితేజ.  మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతోంది.
Image result for raviteja nalaticket
ఎస్ఆర్ టి బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టుకు నిర్మాతలు బాగానే బడ్జెట్ కేటాయించారు. ఇక సినిమాలో కీలక సన్నివేశాల కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ ను నిర్మించారట.ఇందులోనే  మిగిలిన షూటింగ్ పార్ట్ మొత్తం జరిగే అవకాశం ఉంది. 
Image result for raviteja
ఏప్రిల్ చివరినాటికి ఈ సినిమా షూటింగును పూర్తిచేసి, మే చివరలో విడుదల చేయనున్నారు.  ఈ సినిమాలో రవి తేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, ఫిదా ఫేమ్ శక్తి కాంత్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి తేజ ఈ సినిమా తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని ప్రాజెక్టును ఏప్రిల్ నుండి మొదలెట్టనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: