చిరంజీవి వారసత్వాన్ని రామ్ చరణ్ కొనసాగిస్తున్న నేపధ్యంలో చరణ్ నటించే ప్రతి సినిమా కథను చిరంజీవి ముందుగా వినడమే కాకుండా చాల లోతుగా ఆలోచించి అనేక సూచనలు ఇస్తాడు అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ‘నాయక్’ సినిమా నుండి లేటెస్ట్ గా రాబోతున్న ‘రంగస్థలం’ వరకు చరణ్ సినిమాల విషయంలో ఆసినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులు చిరంజీవి సలహాలను తప్పించుకోలేకపోయారు అన్న కామెంట్స్ ఉన్నాయి.
RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఇటువంటి పరిస్థుతులలో రాజమౌళి చిరంజీవిని తప్పించుకుని తిరుగుతున్నాడు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ గా ఎదిగిపోయిన రాజమౌళి తన సినిమాలకు సంబంధించి ఒక్క లైన్ ను మాత్రమే చెపుతాడు తప్పించి మిగతా కథ వివరాలు తన హీరోలకు కూడ చెప్పడు అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
RAJAMOULI MALTISTARER WITH CHARAN AND JUNIOR PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికి కొనసాగింపుగా రాజమౌళి చరణ్ జూనియర్ లతో తీస్తున్న లేటెస్ట్ మల్టీ స్టారర్ కథకు సంబంధించి ఒక లైన్ ను తప్పించి మిగతా వివరాలు ఏమీ ఇప్పటి వరకు చరణ్ జూనియర్ లకు చెప్పలేదని టాక్. మల్టీ స్టారర్ గా నిర్మాణం జరుపుకోబోతున్న ఈమూవీలో చరణ్ జూనియర్ లలో ఏపాత్రకు ఎంత ప్రాధాన్యత అన్న విషయం కేవలం రాజమౌళి మనసులో మాత్రమే ఉంది అని అంటారు. 
CHARAN ALONG WITH JUNIOR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ పరిస్థుతుల నేపధ్యంలో ఈ మల్టీ స్టారర్ లో చరణ్ పాత్ర ఏ మేరకు ఉంటుంది అన్న విషయాలు తెలుసుకోవడానికి వ్యూహాత్మకంగా చిరంజీవి చేసిన ప్రయత్నాలకు రాజమౌళి నుండి సరైన స్పందన రాలేదు అన్న మాటలు హడావిడి చేస్తున్నాయి. ఈవిషయంలో చిరంజీవి ఎంతో వ్యూహాత్మకంగా ఆలోచించి రాజమౌళిని తన ఇంటికి ఆహ్వానించినా ఈ మల్టీ స్టారర్ పనుల బిజీ వల్ల రాలేకపోతున్నానని సున్నితంగా చెప్పినట్లు టాక్. దీనితో రాజమౌళి ఈ మల్టీ స్టారర్ పూర్తి కథను చిరంజీవికి కూడ చెప్పే ఉద్దేశ్యంలో లేడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: