తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన నటుడు మెగాస్టార్ చిరంజీవి.  పది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన తిరిగి గత సంవత్సరం ఇండస్ట్రీకి ‘ఖైదీ నెంబర్ 150’ తో రీఎంట్రీ ఇచ్చాడు.  అప్పట్లో చిరంజీవి క్రేజ్ పడిపోయిందని..ఆయనలో స్టామినా తగ్గిపోయిందని రక రకాల రూమర్లు వచ్చాయి..కానీ వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో ఆ రూమర్లన్నీ పటాపంచలైపోయాయి. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవికి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. 
Related image
ప్రస్తుతం చిరంజీవి 151 వ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన సమయం నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ తరహా పాత్రలో నటిస్తుండడం ఇదే తొలిసారి కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలకు సంబంధించి ఏ చిన్న విషయం అయినా..ఇట్టే వైరల్ అవుతున్నాయి.
Image result for sai ra narasimha reddy
రిసెంట్ గా లీక్ అయిన ‘సైరా’ పిక్స్ సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఈ లుక్ అప్పుడే అభిమానులు బాహుబలి లుక్ తో పోల్చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఫ్యాన్స్ రక రకాలు గా చెప్పుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైరా లుక్ లో గాంభీర్యంగా కనిపిస్తున్నారు. ట్రెడిషనల్ వేషధారణలో చిరంజీవి లుక్ అభిమానులకు కన్నులపండగలా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని ఈ లుక్ ద్వారా అర్థం అవుతోంది. 
Image result for baahubali
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’, ‘బాహుబలి2’ రెండు చిత్రాల్లో ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ద వహించారు. ముఖ్యంగా కాస్ట్యూమ్స్, యుద్దసన్నివేశాల్లో వాడే ఆయుధాలు, ఫ్యూజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్ని విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే..ప్రపంచ స్థాయిలో ఈ సినిమాకు అంత పేరు వచ్చింది.  ఇప్పుడు ‘సైరా’ విషయంలో కూడా ఇదే జాగ్రత్తలు తీసుకోబోతున్నారట. 
 భారీ బడ్జెట్‌తో
బాహుబలి పాత్రకోసం ధరించిన కాస్ట్యూమ్స్, సైరా లుక్ లో ఉన్న చిరంజీవి ధరించిన కాస్ట్యూమ్స్ ఒకేలా ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి బ్రిటిష్ వారికి ఎదురు నిలుస్తూ చెప్పే డైలాగుల కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రంలో నటించే నటులంతా ఆషామాషీ నటులు కాదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ మరియు జగపతి బాబు వంటి ప్రముఖ నటులంతా కీలక పాత్ర పోషిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: