నిన్నరాత్రి ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వర్షం ఎటువంటి అడ్డంకులు క్రియేట్ చేయకుండా సహకరించడంతో మహేష్ ఫుల్ జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు నిన్న విడుదలైన ఈమూవీ ధియేట్రికల్ ట్రైలర్ కు కూడ చాలామంచి స్పందన రావడంతో తన ‘భరత్’ గ్యారెంటీ హిట్ అన్న అభిప్రాయంలోకి వచ్చేసాడు మహేష్.

దీనికితోడు నిన్నటి ఫంక్షన్ లో మహేష్ జూనియర్ ల మధ్య ఇప్పటి వరకు బయటపడని అన్నదమ్ముల బంధం వెలుగు చూడటంతో తన భరత్ కు జూనియర్ అభిమానుల నుండి కూడ పూర్తి సపోర్ట్ లభిస్తుందని అంచనాల పై ఉన్నాడు మహేష్. ఇది ఇలా ఉండగా నిన్న ఈ ఫంక్షన్ పూర్తి అయిన తరువాత భాగ్యనగరంలోని ఒక స్టార్ హోటల్ లో ఏర్పాటు చేసిన డిన్నర్ కు మహేష్ జూనియర్ లతో పాటు రామ్ చరణ్ కూడ రావడంతో మెగా అభిమానుల సపోర్ట్ కూడ మహేష్ లభించినట్లు అయింది.

వరస పరాజయాలతో సతమతమైపోతున్న మహేష్ తన ‘భరత్ అనే నేను’ మూవీకి ఎట్టి పరిస్తుతులలోను ఏ టాప్ హీరో అభిమానుల నుండి నెగిటివ్ టాక్ రాకుండా చాల వ్యూహాత్మకంగా మెగా నందమూరి అభిమానులను బ్యాలెన్స్ చేసుకుంటూ వ్యవహరిస్తున్న తీరు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ పార్టీకి ‘భరత్’ టీమ్ తో పాటు ‘రంగస్థలం’ నిర్మాతలు కూడ రావడం మహేష్ ముందుచూపుకు మరో నిదర్శనం.

నిన్న జరిగిన ‘భరత్’ ఫంక్షన్ ఎటువంటి వివాదాలు లేకుండా జరిగిపోవడంతో మహేష్ తెరిపిన పడినట్లు అయింది. ఈ నేపధ్యంలో ఈమూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ రికార్డులు సృష్టించడం ఖాయం అని అంటున్నారు. మహేష్ ప్రయత్నాలకు నందమూరి మెగా అభిమానుల సపోర్ట్ ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: