తెలుగు ఇండస్ట్రీలో 90 వ దశకంలో వచ్చిన శివ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాగార్జున తో తెరకెక్కించిన ‘శివ’ అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది.  ఒకదశలో అప్పటి వరకు మూస పద్దతిలో వస్తున్న విలనీజానికి కొత్త భాష్యం చెప్పాడు వర్మ.  గ్యాంగ్ స్టర్స్ అంటే ఎలా ఉంటారో..కాలేజీల్లో రాజకీయాలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించాడు వర్మ. 

ఆ తర్వాత వర్మ- నాగ్ కాంబినేషన్ లో అందాల తార శ్రీదేవి నటించిన ‘గోవింద గోవింద’ పెద్దగా సక్సెస్ అందుకోలేక పోయింది.  చాలా సంవత్సరాల తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆఫీసర్’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం టీజర్ విడుదలైంది. 

నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో ఈ టీజర్ ని విడుదల చేశారు. టీజర్‌తో అక్కినేని ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చేశాడు. అదిరిపోయే డైలాగ్‌లతో మెస్మరైజ్ చేశాడు. టీజర్‌లో వర్మ తన మార్క్ చూపించగా... నాగార్జున కూడా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా... సీరియస్ రోల్‌లో కనిపించాడు.  ‘మొదలు పెట్టిన దాన్ని పూర్తిచేయడం నా బాధ్యత’ అంటూ నాగార్జున్ కొట్టే డైలాగ్స్ బట్టి చూస్తుంటే..ఈ చిత్రం పూర్తి స్థాయిలో యాక్షన్, సెంటిమెంట్ తరహా రూపొందినట్లు తెలుస్తుంది. 

‘ఆఫీసర్’ చిత్రం కోసం రామ్ గోపాల్ వర్మ తో కలిసి పని చేసిన ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేశాను. దేనికైనా ముగింపు అనేది అవసరం. మేము ఏం చేశామో ఓ సారి చూడండి’ అని పేర్కొన్న నాగ్, ‘ఆఫీసర్’ టీజర్ ను పొందుపరిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: