ఈ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి.  అన్ని ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (పడకసుఖం) జరుగుతుంది..ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు ముఖ్యంగా అమ్మాయిలు కొంత మంది బడా బాబుల వేధింపులకు గురి అవుతున్నారని..నటి శ్రీరెడ్డి పెద్ద ఉద్యమమే చేపట్టింది.  నెల రోజుల నుంచి తెలుగు అమ్మాయిలకు సినిమా ఛాన్స్ లు ఇవ్వకుండా వారిని పక్కలోకి రమ్మనడం..తీరా ఆ కోరిక తీర్చిన తర్వాత ఛాన్స్ లు ఇస్తామని స్టూడియోల చుట్టూ తిప్పుకోవడం పరిపాటైందని ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చింది.
Image result for sri reddy casting couch
అంతే కాదు తనకు మా అసోసియేషన్ వారు కార్డు సైతం ఇవ్వలేదని గత శనివారం ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసింది.  మొత్తానికి శ్రీ రెడ్డి చేస్తున్న ఉద్యమంపై నేషనల్ స్థాయిలో సోషల్ మీడియాలో వార్తలు మారుమోగడంతో ఆమెకు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, కొంత మంది టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం మద్దతు పలికారు. దీంతో ‘మా’ అసోసియేషన్ వారు మెట్టు దిగి శ్రీరెడ్డికి కార్డు ఇస్తామని..ఆమెతో 900 మంది నటులు నటించవొచ్చని పేర్కొంది. 
Image result for sri reddy casting couch protest
ఇదిలా ఉంటే హైదరాబాదులోని ఒక టీవీ ఛానెల్ సినీ పరిశ్రమలో నెలకొన్న కాస్టింగ్‌ కౌచ్‌ వివాదంపై చర్చాకార్యక్రమం నిర్వహించింది.  ఈ చర్చావేదికలో తనను ముగ్గురు సహనటులు కించపరిచారని, ఆ చర్చా వేదికలో తనకు అవకాశం కల్పించలేదని టీవీ ఛానెల్ పై ఆరోపణలు చేస్తూ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఒక సినీ నటి ఫిర్యాదు చేశారు. అసలు విషయానికి వస్తే.. రాఘశృతి, సునీత అనే ఆర్టిస్టులు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు.
Image result for tv channel
రాఘశృతిది కూడా తన ఊరు కావడంతో ఆమెతో స్నేహం చేశానని, కొన్నాళ్లయ్యాక సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ, ఆమె తనతో చెడు పనులు చేయించేందుకు ప్రయత్నించిందంటూ సునీత ఆరోపించారు.  అంతకు ముందు ఆ ఛానల్ కార్యాలయం ముందు ఆందోళన చేసిన ఆమె ఛానల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు..ఛానెల్ ఫిర్యాదుతో, పోలీసులు ఆమెను స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో సునీత... రాఘశృతి, ఛానెల్ పై ఫిర్యాదు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: