ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తన అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కించిన హీరోయిన్ దివ్యభారతి.  హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే అనుకోని మృత్యువు ఆమెను కబలించింది.  అయితే దివ్యభారతి తెలుగులో అగ్ర హీరోలతో  కొన్ని సినిమాలే చేసింది..కానీ అవన్నీసూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.  తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి..అప్పట్లో శ్రీదేవి, మాధురి కి కాంపిటీషన్ గా నిలిచింది.  దివ్యభారతి బాలీవుడ్ లో నటించిన  'విశ్వాత్మ' ఎంత హిట్ అయ్యిందో..అందులో సాంగ్స్ కూడా అంతే హిట్ అయ్యాయి. 
Related image
తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నట దంపతులు సైఫ్‌ అలీ ఖాన్‌, అమృతా సింగ్ ల కుమార్తె సారా అలీ ఖాన్‌ దివ్యభారతి పాటకు స్టెప్పులేసి బాలీవుడ్ సెలబ్రిటీలను ఆకట్టుకుంది.ఇటీవల ఫ్యాషన్ డిజైనర్ సందీప్ ఖోస్లా బంధువు సౌదామిని మట్టుకు వివాహం జరిగింది. ఆ పెళ్లివేడుకకు సంప్రదాయబద్దంగా చీరలో హాజరైన సారా అలీ ఖాన్ 'సాత్ సముందర్ పార్' అనే పాటకు స్టెప్పులేసింది.
Image result for sara ali khan dance
ఈ సందర్భంగా 'విశ్వాత్మ' సినిమాలో దివ్యభారతి నటించిన సాత్ సముందర్ పాటకు డాన్స్ చేసింది. ఆమె వేసిన స్టెప్పులకు కేరింతలు కొట్టారు. సారా అద్భుతంగా డాన్స్ చేసిందంటూ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ వేడుకలో అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, కరణ్‌ జోహార్‌, సోనమ్‌ కపూర్ తదితరులు సందడి చేశారు. 
Image result for sara ali khan dance
తెలుగు టెంపర్ హిందీ రీమేక్‌ ‘సింబా’ లో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా సారా నటిస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, ప్రియాప్రకాశ్‌ పేర్లను పరిశీలించిన యూనిట్ చివరకు సారాన్ కన్ఫామ్ చేశారు.  మరో చిత్రం ‘కేదార్‌నాథ్‌’ లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు జోడీగా నటిస్తున్న సారా.. షూటింగ్ షెడ్యూళ్లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: