ఈరోజు రాష్ట్రంలో ఏచోటున నలుగురు కలిసినా ఆనలుగురు మాట్లాడుకునేది ఈ నాలుగు విషయాల గురించే. నిన్నటి శుక్రు వారం భారత దేశ ఆర్ధిక వ్యవస్థలో బ్లాక్ ఫ్రైడే గామరిపోయి రూపాయి డాలరు విలువతో 62 రూపాయలు చేరుకోగా ఆ దెబ్బకు షేర్ మార్కెట్ కుదేలు అయిపోయి ఒక్కరోజులోనే రెండు లక్షల కోట్లు ఆవిరి అయిపోయి అందరినీ కలవరపరిచింది.

కేవలం మూడురోజులలో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు వాసులు చేసిన షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ బాలీవుడ్ రికార్డులను తిరగ రాసింది. ఎటువంటి ట్విస్ట్ లు లేని ఒక మాములు మసాలా సినిమా ఇలా సూపర్ హిట్ కావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

విడుదల తేది ఎప్పుడో తెలియకపోయినా రోజురోజుకు పెరిగిపోతున్న క్రేజ్ తో పవన్ కాటం రాయుడు పాటతో ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల కాకుండానే లక్షల సంఖ్యలో హిట్లు తెచ్చుకుంటూ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ డి ఇండస్ట్రీ గా మారిపోయింది.

నాయకుడే లేకుండా ప్రజలే నాయకులుగా మారిపోయి రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని ప్రజా ఉద్యమంలా సమైఖ్యంద్రాను కోరుకుంటూ కోస్తా జిల్లాలను మండిస్తున్న సమైఖ్య సెగతో నాయకుల కుర్చీల కింద మంటలు మండిపోతూ ప్రజాశక్తీ బలమేమిటో నిరుపిస్తోంది సమైఖ్య ఉద్యమం. ఇలా ఈరోజురాష్ట్రంలో మెయిన్ టాపిక్స్ గా ఉన్న ఈ విషయాలను కనీసం ఒక్క ఐదు నిముషాలు అయినా మాట్లాడుకోకుండా రోజుగడవడం లేదు అంటే ఈ నలుగు శక్తులు మనల్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు... 

మరింత సమాచారం తెలుసుకోండి: