ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ దర్శకుడు స్థాయికి ఎదిగిన రాజమౌళి ‘మహానటి’ మూవీ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ‘మహానటి’ ఒక అద్భుతం అంటూ రాజమౌళి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. వాస్తవానికి ఈమూవీ విడుదలకు ముందు తాను ఈసినిమా గురించి ఏమాత్రం పట్టించుకోలేదు అని అన్నాడు. 

అయితే ఈసినిమా చూసిన తరువాత తాను ఈసినిమాతో కనెక్ట్ అయిన విషయాన్ని వివరిస్తూ నాగ్ అశ్విన్ ఈమూవీలో ఎమోషనల్ సీన్స్ తీసిన విధంగా భావోద్వేగంగా తాను కూడ తీయలేను అంటూ తన అసమర్ధతను బయట పెట్టాడు రాజమౌళి. ఇక ఈసినిమా గొప్పతనం గురించి అందరూ పొగుడ్తూ నాగ్ అశ్విన్ ను ఆకాశానికి ఎత్తేస్తుంటే తనకు జలసీ కలుగుతోందని తాను ఇటువంటి సినిమాను ఎందుకు తీయలేకపోయానా అన్న బాధ తనకు కలుగుతోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు రాజమౌళి.
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇక ఇలా ఉండగా ‘మహానటి’ విడుదల తరువాత వచ్చిన నిన్నటి మొదటి సోమవారం పరీక్షను చాల విజవంతంగా పూర్తి చేసుకుంది. మన తెలుగు రాష్ట్రాలలోని అన్ని ధియేటర్స్ లో ఈమూవీ కలక్షన్స్ చాల స్థిరంగా కనిపించడంతో ‘మహానటి’ బ్లాక్ బస్టర్ హిట్ అన్న నిర్ణయానికి ఇండస్ట్రీ విశ్లేషకులు వచ్చారు. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఆశ్చర్యకరంగా  ఈమూవీకి ప్రస్తుతం మల్టీ ప్లేక్స్ ధియేటర్స్ లో వస్తున్న కలక్షన్స్ టాప్ హీరోల సినిమాల రేంజ్ ను మించి ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనికితోడు ఈమూవీ ఓవర్సీస్ కలక్షన్స్ రెండు మిలియన్స్ కు దగ్గరకు చేరుకోవడంతో ఈమూవీ విడుదలైన వారం పూర్తి కాకుండానే అమెరికాలో రెండు మిలియన్ మార్క్ ను ‘మహానటి’ అందుకోవడం ఖాయం అని అంటున్నారు. ‘బాహుబలి’ లాంటి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించే సినిమాను తీసిన రాజమౌళి తాను మహానటి లాంటి సినిమాను ఎందుకు తీయలేకపోయాను అని అంటూ ఓపెన్ గా చెపుతున్నాడు అంటే ఈమూవీ మ్యానియా స్థాయికి చేరిందో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: