తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేసిన శ్రీరెడ్డి ఆ మద్య పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పెను వివాదాలకు దారి తీసింది.  ఆ తర్వాత జరిగిన పరిణామాలు పవన్ వర్సెస్ మీడియా మద్య పెద్ద యుద్దమే అయ్యింది.  అయితే అప్పటి వరకు శ్రీరెడ్డికి ఎంతో సపోర్ట్ చేసిన వారు ఒక్కసారే యూటర్న్ తీసుకున్నారు.  ఇక మీడియా సైతం శ్రీరెడ్డిని దూరం ఉంచడం ప్రారంభించింది.  కొంత కాలంగా ఇంటికే పరిమితం అయిన శ్రీరెడ్డి అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లలో హల్ చల్ చేస్తుంది. 
Image result for sri reddy
కాకపోతే తన ఇంటి నుంచి సోషల్ మాద్యమాల ద్వారా పవన్, కొంత మంది ఇండస్ట్రీ పెద్దలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. మరోవైపు శ్రీరెడ్డి ని సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.  ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఎయిడ్స్‌తో చనిపోయిందని కొందరు, ఆత్మహత్య చేసుకుందని మరికొందరు పోస్టింగ్‌లు చేస్తున్నారు.
Related image
తనపై కక్ష సాధించేందుకు కావాలనే కొంత మంది ఇలా చేస్తున్నారని శ్రీరెడ్డి మండిపడింది.  ఈ విషయంపై మండిపడ్డ శ్రీరెడ్డి తనపై కక్ష సాధించేందుకు కావాలనే కొంత మంది ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పోస్టులు చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు  ఫిర్యాదు చేసింది.
Related image
ఒక్కొక్కడి తాట వలుస్తా జాగ్రత్త. సైబర్ క్రైమ్‌లో కేసులు ఫైల్ చేశా. ఆడపిల్లలంటే మీ ఇష్టారాజ్యానికి ఏమైనా తిట్టొచ్చు అనుకునేవారికి చెల్లు చీటి. ఇప్పటికి 41 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇకపై పెద్ద తలకాయల పని చెప్తా..’ అంటూ శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ అకౌంట్లో రాసుకొచ్చింది.

Image result for sri reddy police case


మరింత సమాచారం తెలుసుకోండి: