డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ను మెప్పించడం సాధారణమైన పని కాదు. ఒక వేళ వర్మ కు ఏదైనా నచ్చినా, ఎదుటి వ్యక్తి కాళ్ళకు నమస్కారం చేస్తాను అనేంత వినయం కూడా రామ్ గోపాల్ వర్మ దగ్గర లేదు. అటువంటి వర్మ నిజంగానే ఒక డైరెక్టర్ ప్రతిభ చూసి ఫిదా అయిపోయి, అతడి కాళ్ళు మొక్కుతాను అని బహిరంగంగా అన్నాడు. ఇంతకీ అతడు మరెవ్వరో కాదు ‘చెన్నయ్ ఎక్స్ ప్రెస్’ సినిమా తీసి కేవలం 15 రోజులలో 200 కోట్లు కొట్టేసి, 300 కోట్ల కలెక్షన్స్ వైపు పరుగులు తీస్తున్న రోహిత్ శెట్టి. ఇతడు దర్శకత్వం వహించిన చెన్నయ్ ఎక్స్ ప్రెస్ ఏ క్షణాన విడుదల అయిందో తెలియదు కాని విడుదల అయిన దగ్గర నుంచి బాలీవుడ్ లో ప్రతిరోజు ఈ సినిమా గురించే హాట్ హాట్ టాపిక్.

‘షోలే’, ‘ముఘల్ ఎ అజమ్’, ‘దిల్ వాలే దుల్హనియా లేజాయే౦గే’, ‘త్రీ ఇడియట్స్’ సినిమాల రికార్డులు అన్నిటిని ఈ సినిమా తిరగరాస్తోంది. దీనితో ఫిదా అయిపోయిన వర్మ ఈ సినిమాను ఇప్పటికీ ఐదు సార్లు చూశాడట. చూసిన ప్రతిసారి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాడట. ఇంత పక్కా కమర్షియల్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రోహిత్ శెట్టి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ తనకు అవకాశం వస్తే దర్శకుడు రోహిత్ శెట్టి కాళ్ళకు మొక్కాలని ఉంది అంటూ రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కామెంట్స్ బాలీవుడ్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయాయి. దీనితో అందరిపై ఏదో ఒక విమర్శలు చేసే రామ్ గోపాల్ వర్మ దర్శకుడు రోహిత్ శెట్టి ని ఇలా పొగడడం చూస్తూ ఉంటే భవిష్యత్ లో వర్మ కూడా చెన్నయ్ ఎక్స్ ప్రెస్ లాంటి మసాలా సినిమా తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనిపిస్తోంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: