జీవితంలో పైకి రావాలి అని కోరుకొనే వారందరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. కాని పోలాండ్ లోని వార్సా పట్టణానికి చెందిన ఒక అందమైన అమ్మాయి లక్ష్యం వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. వార్సా లోని 21 ఏళ్ళ అమ్మాయి అనియా లిసేయోష్కా కు ఒక విచిత్రమైన కోరిక ఉంది.

ఆమెకు లక్షమంది పురుషులతో లైంగిక క్రీడ చెయ్యాలని ఆమె జీవిత ధ్యేయం అట. దానికోసం ఆమె ఒకొక్క పురుషుడికి 20 నిమిషాలు కేటాయిస్తోందట. ఈ వార్త కధనాన్ని ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ఆమె ఫోటో తో సహా ప్రచురించింది. పోలాండ్, ఐలాండ్, ఐరోపా లోని పురుషులే కాకుండా ప్రపంచంలోని ఏ దేశంలోని పురుషులైనా ఆమెతో ఈ క్రీడలో పాల్గొనవచ్చని ఓపెన్ ఆఫర్ ఇస్తోంది. పోలాండ్ దేశంలో విచ్చలవిడిగా చేసే సెక్స్ ను ఇప్పటికీ ఆదేశ సాంప్రదాయాలు ఒక మచ్చగా భావిస్తాయని, ఇష్టం వచ్చినట్లు లైంగిక కోరికలు తీర్చుకోవడం ఆ దేశ సాంప్రదాయాలకు విరుద్ధంగా భావిస్తాయని, అందుకనే ఆ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలపై తిరుగుబాటు చెయ్యడానికే తానిప్రయత్నాన్ని మొదలు పెట్టి ప్రపంచంలో తాను కూడా ఒక సెలబ్రిటీలా మారాలని కోరుకుంటున్నానని ఈమె తన ఫేస్ బుక్ లో కామెంట్స్ పెట్టి అందరి ద్రుష్టి ని ఆకర్షిస్తోంది.

ఇప్పటికే ఆస్ట్రియన్ టైమ్స్ ఇంగ్లీష్ పత్రికలో ఈమె గురించి వచ్చిన కధనాలు ప్రపంచ౦లో అలజడి సృష్టిస్తున్నాయి. లక్షమంది తో సెక్స్ అనే విషయాన్ని ఒక యజ్ఞంగా భావిస్తున్న ఈమె ఇప్పటి వరకూ ఆమె 284 మంది తో సెక్స్ లో పాల్గోన్నట్లుగా ఆమె తన ఫేస్ బుక్ లో వివరించిందని ఈ విషయాన్ని ప్రచురించిన ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక పేర్కొంటోంది. ప్రతి వింతను ఒక అద్భుతంగా గిన్నీస్ బుక్ రికార్డు చేస్తుంది కాబట్టి భవిష్యత్ లో ఈమె పేరు కూడా గిన్నీస్ బుక్ లోకి ఎక్కినా ఆశ్చర్యం లేదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: