తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ హాస్య దర్శకులు మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ నటిస్తున్న చిత్రం ‘శైల‌జా రెడ్డి అల్లుడు’. ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందిస్తుంది.  ఫ్యామిలీ ఎంట్రటైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ ప్రత్యేక సాంగ్  అలరించబోతుంది.  తెలంగాణ జానపద గాయనిగా పలు పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ. తనదైన స్వరం, తెలంగాణ యాసతో అన్ని పండుగలకు ప్రత్యేక పాటలు పాడి భేష్ అనిపించుకుంది. 

తాజాగా ఈ పాట లిరికల్ వీడియోను బయటకు వదిలింది చిత్రయూనిట్. శాసనమే తన మాట .. నీ అత్త శివగామి బయట .. పంతం కూతురు ఎదుట .. టామ్ అండ్ జెర్రీ ఆట .., అమ్మకు అచ్చు జిరాక్సు .. ఈ బొమ్మకు పిచ్చి పీక్సు .. బద్దలు కానీ బాక్సు .. వద్దనే మాటకు ఫిక్సు .. అత్తను చూస్తే నిప్పుల కుండ .. కూతురు చూస్తే కత్తుల దండ .. ఈ ఇద్దరూ సల్లగుండా .." అంటూ   ఓ పక్క అత్త మరోపక్క ప్రియురాలు మధ్య నలిగిపోయే నాగచైతన్య పరిస్థితిని వివరిస్తూ హుషారెత్తిస్తోంది. 

శైల‌జా రెడ్డి చిత్రం కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల‌ని తప్ప‌క అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు.  త్వ‌ర‌లోనే మూవీ విడుద‌లకి ప్లాన్ చేస్తుండ‌గా, నిర్మాత‌లు మూవీపై ఆస‌క్తి క‌లిగేలా పోస్ట‌ర్స్ లేదా లిరిక‌ల్ వీడియో సాంగ్స్ విడుద‌ల చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: