ఒక్క క‌న్నుగీటుతో కోట్లాది హృద‌యాలు గెలుచుకున్న అందాల భామ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. ఈ అమ్మడికి చిన్నా పెద్దా ఒక్కరేమిటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫిదా అయ్యారు.  సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ప్రియా ఎక్స్ ప్రెషన్స్ కి ఫిదా అయ్యారు. మలయాళం సినిమా 'ఓరు అదార్ లవ్'లోని 'మానిక్యా మలారాయ పూవి' అనే సాంగ్ లో ప్రియా తన లవ్ ఎక్స్ ప్రెస్ చేసే భాగంలో ఇలా చేసింది.
Image result for priya varrier
తాజాగా  హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న 16వ సంతోషం సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక‌లో పాల్గొనేందుకు ఈ నెల 26న హైద‌రాబాద్‌కి రానుంది ‘బెస్ట్ ఫేస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆమె అందుకునేందుకు ప్రియా హైద‌రాబాద్‌కి వ‌స్తున్న‌ట్టు సంతోషం సినీ మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తెలిపారు. 
Image result for priya varrier
ఇప్పటి ఎన్నో అద్భుతమైన ఈవెంట్స్ చేసిన కొండేటి సురేష్ ఏర్పాటు చేశారు. . ప‌లువురు సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నున్న ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: