తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చిత్రంలో నటించిన రాంచరణ్ అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేశాడు.  తర్వాత వచ్చిన చిత్రాలు కూడా రాంచరణ్ కి మంచి ఇమేజ్ ని తీసుకు వచ్చింది.   ఈ మద్య సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రం రెండు కోట్ల క్లబ్ లో చేరడం కూడా మరో విశేషం.   

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం అజర్‌బైజాన్‌ లో జరుగుతోంది. అక్కడ భారీ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అక్కడ భారీ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవల మెయిన్‌ విలన్‌గా నటిస్తున్న వివేక్‌ ఒబెరాయ్‌ తన షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇండియా వచ్చేశారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం కూడా జార్జియాలో జరుపుకుంటున్నారు. 

రాంచరణ్ షూటింగ్ స్పాట్ కి వెళ్లి సందడి చేశాడు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టేట్‌ రౌడీ అనే టైటిల్‌ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్.  అయితే ఈ విషయంపై చిత్రయూనిట్‌ ఎలాంటి ప్రకటన చేయకపోయినా సోషల్‌ మీడియాలో చరణ్ స్టేట్‌ రౌడీ సినిమా పోస్టర్‌ అంటూ ఫ్యాన్‌ మేడ్ పోస్టర్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి.చిరంజీవి హీరోగా 1989లో రిలీజ్‌ సినిమా స్టేట్‌ రౌడీ.



మరింత సమాచారం తెలుసుకోండి: