తెలుగు ఇండస్ట్రీలో పదమూడు సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ‘పందెం కోడి’ చిత్రంతో తమిళ్ లోనే కాదు..తెలుగు తెరపై కూడ దుమ్మురేపింది. ఈ చిత్రంతో తమిళ హీరో అయిన విశాల్..తెలుగులో కూడా మంచి అభిమానం సంపాదించాడు. విశాల్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన పందెం కోడి చిత్రం బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్‌గా పందెం కోడి 2 తెరకెక్కుతుంది. తమిళంలో ఈ చిత్రం సందకోళి 2 పేరుతో విడుదల కానుంది.
లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ లేడి విలన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తెలుగు వర్షన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక్కో డైలాగ్ వింటుంటే..రోమాలు నిక్కబోడుస్తున్నాయి.
‘జాతర లో పులి వేషాలు వేయొచ్చు..కానీ పులి ముందే వేషాలు వేయకూడదు’ అనే డైలాగ్ అదిరిపోయింది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై విశాల్, ధావల్ జయంతిలాల్, అక్షయ్ జయంతిలాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. లేడి విలన్ గెటప్‌లో వరలక్ష్మీ లుక్ అదిరిపోయింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు.