భాతరదేశంలో హాలీవుడ్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది.  అక్కడి టాప్ మోస్ట్ మూవీస్ తెలుగులో డబ్ అవుతుంటాయి.  వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించే హాలీవుడ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు.  కొన్ని హాలీవుడ్ చిత్రాలు అనూహ్యమైన విజయాలను అందుకొని భారీ ఎత్తున కలెక్షన్లు కూడా రాబట్టిన రోజులు ఉన్నాయి. 
Image result for సముద్ర పుత్రుడు
తాజాగా ‘ఆక్వామేన్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ తో పాటు తెలుగు ,హిందీ , తమిళ భాషల్లో డిసెంబర్ 14వ తేదిన విడుదల కానుంది.. తెలుగులో సముద్ర పుత్రుడు పేరుతో రీలీజ్ చేయనున్నారు.. తెలుగు వర్షన్ హక్కులను ఎన్ వీఆర్ సినిమాస్ అధినేత ఎన్ వి ప్రసాద్ దక్కించుకున్నాడు. 
Image result for సముద్ర పుత్రుడు
ఈ చిత్రం నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అద్భుతమైన విజువల్స్ తో ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సముద్రం నేపథ్యంలో సాగే కథ ఆశ్చర్యచకితులను చేస్తోంది. 'ది కంజురింగ్, ది కంజురింగ్ 2 , ఫ్యూరియస్ 7' వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జేమ్స్ వన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వార్నర్ బ్రదర్స్ , డీసీ కామిక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2డి తో పాటు 3డి లోను విడుదలకానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: