రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో ఇప్పుడు తన దృష్టి తన కొడుకు కార్తికేయ పెళ్లి పై పెట్టాడు. జగపతిబాబు అన్న కూతురు పూజతో కార్తికేయ పెళ్లి జనవరి 5న జరుగుతుందని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అయితే జనవరి 5న జరగబోతున్నది కార్తికేయ-పూజల మ్యారేజ్ రిసప్క్షన్ మాత్రమే.

తెలుస్తున్న సమాచారం మేరకు కార్తికేయ పూజల పెళ్లి ఒక డెస్టినేషన్ మ్యారేజ్ గా డిసెంబర్ 30న జైపూర్ లో జరగబోతోంది. జైపూర్ లోని అత్యంత విలాసవంతమైన ప్యారామౌంట్ హోటల్ ప్యాలెస్ లో పెళ్ళి అత్యంత ఘనంగా జరగబోతోంది. 250 ఎకరాలలో రాజస్థానీ సంస్కృతిని ప్రతిబింబించే భారీ ఎత్తైన కోటలకు సంబంధించిన రూపంతో నిర్మింపబడ్డ ఈ ప్యారామౌంట్ హోటల్ ప్యాలెస్ ఒక అద్భుతం అనీ విదేశీ పర్యాటకులు  కూడ ప్రశంసిస్తూ ఉంటారు. 

ఈ హోటల్ లో నిర్మింపబడ్డ పెళ్ళి మండపం ‘బాహుబలి’ సెట్ ను మరిపించేలా ఉంటుంది. దీనితో తనకు జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ‘బాహుబలి’ కల్చర్ ను కొనసాగిస్తూ రాజమౌళి అనేక ఆలోచనలు చేసి తన కొడుకు పెళ్లి కోసం ఈ ప్యారా మౌంట్ హోటల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ పెళ్లి వేడుకులకు కేవలం రాజమౌళి జగతతిబాబు కుటుంబ సభ్యులతో పాటు అతి తక్కువమంది ఫిలిం సెలెబ్రెటీలు ఈ పెళ్ళికి హాజరు అవుతారని తెలుస్తోంది. రాజమౌళి జాతీయ స్థాయి సెలెబ్రెటీ కాబట్టి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నటీనటులు రాజకీయ వేత్తలు ఇలా ఎందరో జనవరి 5న హైదరాబాద్ లో జరగబోతున్న మ్యారేజ్ రిసప్క్షన్ కు రాబోతున్నారని తెలుస్తోంది. భాగ్యనగరంలో జరగబోయే ఈ ఫంక్షన్ వేడుకలకు సంబంధించిన వేదికను ‘బాహుబలి’ రీతిలో ఒక భారీ సెట్ లో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ స్టార్ వెడ్డింగ్ త్వరలో మీడియాకు హాట్ టాపిక్ గా మారనున్నది..  


మరింత సమాచారం తెలుసుకోండి: