సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తి కావడంతో ఇక ఈనెల 25న విడుదల కాబోతున్న అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ మూవీ పై అంచనాలు మొదలు అయ్యాయి. ఇప్పటికే రెండు వరస ఫెయిల్యూర్స్ తెచ్చుకున్న అఖిల్ కు ఈ మూవీ ఖచ్చితంగా విజయం సాధించ వలసిన అవసరం ఏర్పడింది. 
Mr. Majnu Telugu Movie
ఈ నేపధ్యంలో ఈమూవీ ప్రమోషన్ ను చాల భారీగా చేయబోతున్నారు. రేపు జనవరి 19న హైదరాబాద్ లోని జెఆర్సి కన్వెంక్షన్ హాలులో ఈమూవీ ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా జరగబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈమూవీలోని పాటలు యూత్ కు బాగా కనెక్ట్ అయిన నేపధ్యంలో ఈమూవీని ఎదో విధంగా హిట్ చేసి అఖిల్ స్టామినాను నిరూపించాలని ఈమూవీ నిర్మాతలతో పాటు అక్కినేని కాంపౌండ్ చాల గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
Mr Majnu teaser talk
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జునకు జూనియర్ కు ఉన్న సాన్నిహిత్యంతో నాగ్ అడగగానే అఖిల్ ను ప్రమోట్ చేసే బాధ్యతను జూనియర్ తీసుకున్నట్లు సమాచారం. అఖిల్ మొదటి సినిమా ఆడియో ఫంక్షన్ కు మహేష్ అతిధిగా వస్తే అఖిల్ నటించిన రెండవ సినిమా ‘హలో’ మూవీ ఫంక్షన్ కు చిరంజీవి అతిధిగా వచ్చాడు.
Mr Majnu theatrical trailer
అయితే ఈ టాప్ హీరోలు ఇద్దరు అఖిల్ ను ప్రశంసిస్తూ ఎన్ని ప్రశంసలు చేసినా ఆ ప్రశంసలు ఆసినిమాలను హిట్ చేయలేకపోయాయి. దీనితో ఈసారి అఖిల్ జూనియర్ గోల్డెన్ హ్యాండ్ పై ఆధారపడుతున్నాడు. దర్శకుడు వెంకీ అట్లూరి ‘తొలిప్రేమ’ సక్సస్ తరువాత నిర్మింప బడ్డ ఈమూవీ పై చాల భారీగా ఖర్చు పెట్టారు. అఖిల్ చేస్తున్న ఈ మూడవసారి ప్రయత్నం కూడ ఫెయిల్ అయితే అఖిల్ కెరియర్ కు తీవ్ర సమస్యలు ఏర్పడే నేపధ్యంలో ఈసారి తనరూట్ ను మార్చి యూత్ ను టార్గెట్ చేస్తూ అఖిల్ చేస్తున్న ప్రయత్నానికి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో ఈ నెలలో వచ్చే రిపబ్లిక్ డే నాటికి తేలిపోతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: