ఈ మద్య దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.  అధికార పార్టీలోకి ప్రతిపక్ష నేతలు ఎంట్రీ ఇస్తుంటే...కొంత మంది మాత్రం ప్రతిపక్ష పార్టీలోకి చేరిపోతున్నారు.   బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. వెంటనే ఆమెను బీజేపీ విమెన్ ట్రాన్స్ పోర్ట్ వింగ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు.

కాగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 2002లో వచ్చిన 'కంపెనీ' సినిమా ద్వారా ఇషా కొప్పికర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హిందీతో పాటు తమిళ, తెలుగు, మరాఠీ, కన్నడ చిత్రాల్లోనూ ఆమె నటించారు. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ బీజేపీ నేత కైలాష్ ప్రియాంక గాంధీని ఉద్దేశించి.. బాలీవుడ్ నటీనటుల్లాగే ప్రియాంక గాంధీ కూడా 'చాక్లెట్ ఫేస్' అంటూ వ్యాఖ్యలు చేసిన మరునాడే ఇషా కొప్పికర్ బీజేపీలో చేరడం గమనార్హం.
Image result for Isha koppikar
ఇటీవల  కొన్ని రాజకీయ పార్టీలు కరీనా కపూర్, సల్మాన్ ఖాన్‌లను పాలిటిక్స్‌లోకి వస్తున్నారని పుకార్లు వస్తున్నాయి..కాకపోతే ఈ తారలు వాటిని ఖండించారు.  2009, నవంబర్‌ 29న వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్‌ను పెళ్లి చేసుకున్నారు...ఈ దంపతులకు ఐదేళ్ల పాప ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: