తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ మొదటి నుంచి ఇండస్ట్రీలై తనదైన మార్క్ చాటుకుంటూ వస్తున్నాడు.  డ్యాన్స్, ఫైట్స్, కామెడీ ఏదైనా పర్ఫెక్ట్ టైమింగ్ తో మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకున్నాడు.  త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాడు.  ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నారు. 
Image result for allu arjun family
రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా తాను ప్రేమించిన అమ్మాయిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.  అల్లు అర్జున్  సతీమణి స్నేహారెడ్డి.  షూటింగ్ సమయంలో ఎంత బిజీగా ఉన్నా బన్ని తన కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటాడు.  తన కుమారుడు అయాన్, కూతురు అర్హలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ సంబరపడిపోతుంటాడు.

తాజాగా, తన కూతురు అర్హతో తన సరదా సంభాషణను ఆయన పోస్ట్ చేశాడు. అర్జున్ చెబుతున్న మాటలను అర్హ తిరిగి చెబుతూ.. తండ్రిని ఆటపట్టించింది. ‘నాన్నా.. నేను, నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను’ అని అర్జున్ చెప్పిన మాటలను అర్హ తిరిగి అనడం ఈ వీడియోలో కన్పిస్తుంది. ‘చేసుకుంటావా? చేసుకోవా?’ అని అర్జున్ అడగడం..‘చేసుకోను’ అని అర్హ చెప్పడంతో ‘దొంగ ఫెలో..చేసుకుంటానని చెప్పు’ అని అర్జున్ అంటూ తన కూతురుని గారాబం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: