తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరుకు స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇస్తునే ఉన్నారు.  ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  అక్కినేని ఫ్యామిలీ నుంచి సుమంత్, నాగచైతన్య,అఖిల్ లు హీరోలుగా రాణిస్తున్నారు. మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ లు హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తర్వాత నందమూరి హరికృష్ణ తనయులు కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు. 

Image result for balakrishna mokshagna

ఇక నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.  కానీ బాలకృష్ణ మాత్రం ఇప్పుడు కాదు..సరైన సమయం రావాలని చెబుతూ వస్తున్నారు.  ఏడాదిలోనే మోక్షజ్ఞ ఫస్టు సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంతా భావించారు. కానీ ఈ విషయానికి సంబంధించిన సమాచారం ఇంతవరకూ బయటికి రాలేదు. నేడు బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం రిలీజ్ అయ్యింది. 

Related image

ఈ సందర్భంగా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "మోక్షజ్ఞ కోసం ఇంతవరకూ ఎలాంటి కథలను వినలేదు. మంచి కథ దొరికితే ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతాయి. వచ్చే ఏడాది మోక్షజ్ఞ హీరోగా తప్పకుండా ఓ సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. ఆ మద్య  మోక్షజ్ఞ ఎంట్రీ మాస్ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ తోనే ఉంటుందిన కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏపిలో ఎన్నికల హడావుడి పూర్తయిన తర్వాత అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: