సమంత నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత అక్కినేని కుటుంబ కోడలుగా చాల పద్ధతులు నేర్చుకున్నాను అంటూ ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సమంత చైతూల ప్రేమను అంగీకరించే ముందు నాగచైతన్య తల్లి లక్ష్మీ సమంతను అనేక విధాలుగా పరిశీలించింది అన్న వార్తలు కూడ అప్పట్లో వచ్చాయి. 

పెళ్లి తరువాత సినిమాలలో బిజీగా ఉంటున్న సమంత తన అత్తగారితో కలిసి ఉన్న ఫోటో ఎప్పుడు చైతు అభిమానులకు లీక్ కాలేదు. అయితే ఈమధ్యనే జరిగిన వెంకటేష్ కూతురు పెళ్ళిలో ఈ అత్తా కోడళ్ళు కలవడంతో పాటు సమంత ఆమె అత్తగారు లక్ష్మీ ఒకే డిజైన్ తో ఉన్న డ్రస్ తో కనిపిస్తున్న ఫోటోను సమంత తన అభిమానులకు షేర్ చేసింది. 

దీనితో కొందరు అభిమానులు ఆమె షేర్ చేసిన ఫోటో పై స్పందిస్తూ అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళు లా ఉన్నారు అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రశంసలకు స్పందిస్తూ సమంత తాను చైతన్యను తల్లిలాగే చూసుకుంటున్నాను అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. 

ప్రస్తుతం సమంత నాగచైతన్య అతడి తల్లి లక్ష్మీ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నటిజన్లు ఆ ఫోటోకు లైకులు కొడుతూ ఇలాగే ఎప్పుడు చైతన్యను అతడి తల్లిని బాగా చూసుకుని ఉత్తమ నటిగానే కాకుండా ఉత్తమ కోడలుగా కూడ అవార్డులు వచ్చేలా సమంత జీవితం ఉండాలి అంటూ అభిమానులు అభినందనలు తెలియచేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: