రేపు విడుదలకాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ నిన్న రాత్రి రామ్ గోపాల్ వర్మ తనకు అత్యంత సన్నిహితులైన కొందరికి రామానాయుడు స్టూడియోస్ లో చూపించి నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన షోకి వర్మతో అత్యంత సన్నిహితంగా ఉండే పూరి జగన్నాథ్ ఛార్మీలతో పాటు కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు మరికొందరు మీడియా వర్గాలకు చెందిన వ్యక్తులు ఈమూవీని నిన్న రాత్రి చూసినట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఫస్ట్ హాఫ్ అంతా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ లమీద నడిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లక్ష్మీపార్వతి వ్యక్తిగత జీవితానిసంబంధించి ఆమె తొలిభర్త సంతానం ఎన్టీఆర్ కు ఆమె ఎలా దగ్గరకావడం జరిగింది  వారిద్దరి మధ్య పరిచియం పెళ్ళికి ఎలా దారితీసింది అన్న విషయాలు వర్మ ఈమూవీ ఫస్ట్ హాఫ్ లో చూపించినట్లు తెలుస్తోంది. 

ఇక ఈ మూవీ సెకండ్ హాఫ్ ప్రారంభం అవడంతోనే సినిమా పూర్తిగా రాజకీయాల చుట్టూనే తిరిగే విధంగా వర్మ ఈ మూవీ సీన్స్ ను మలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అధికారం కోల్పోవడం వెన్నుపోటు సంఘటన నిరాశతో అనారోగ్యం రావడం చనిపోవడం వంటి సీన్లు ఎన్టీఆర్ అభిమానుల గుండెను కలిచివేసే విధంగా వర్మ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 

అయితే ఈమూవీ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ స్లోగా అనిపించింది అని లీకులు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఈసినిమాను ప్రదర్శించే ధియేటర్లకు కొన్ని బెదిరింపు ఫోన్స్ అజ్ఞాత వ్యక్తుల నుండి వస్తున్నట్లు సమాచారం. దీనితో రేపు ఈసినిమాను తమ ధియేటర్లలో ప్రదర్శిస్తే పరిస్థితి ఏమిటి అంటూ చాలామంది ధియేటర్స్ ఓనర్స్ కలవర పెడుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: