యాంగ్రీ యంగ్‌మేన్ రాజ‌శేఖ‌ర్ పీఎస్‌వీ గరుడ వేగ హిట్ అయ్యాక మాంచి జోష్‌తో క‌నిపిస్తున్నాడు. ఇటీవ‌ల మా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాక రాజ‌శేఖ‌ర్‌లో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇక తాజాగా ప్ర‌శాంత్‌వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రాజ‌శేఖ‌ర్ న‌టిస్తోన్న యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్ క‌ల్కి. కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ గురువారం రిలీజ్ అయ్యింది. మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా రిలీజ్ అయిన అన్ని థియేట‌ర్ల‌లోనూ క‌ల్కి ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఇక నాని జెర్సీ ఆడుతున్న థియేట‌ర్ల‌లోనూ క‌ల్కి ట్రైల‌ర్ వ‌దిలారు.


ట్రైల‌ర్ చూస్తేనే క‌ల్కి ప‌క్కా యాక్ష‌న్ & క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ అని తెలిసిపోతోంది. భగవద్గీతలోని ‘పార్థా.. కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు కానీ.. వాని ఫలితంపై లేదు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైల‌ర్ ఇన్వెస్టిగేష‌న్ బిగిన్స్ అనే అక్ష‌రాల‌తో ఎండ్ అవుతుంది. ట్రైల‌ర్ చూస్తుంటే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్‌వ‌ర్మ సినిమాను రొటీన్‌కు భిన్నంగానే తెర‌కెక్కించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. 


ఇక రాజ‌శేఖ‌ర్ ట్రైల‌ర్‌లో చెప్పిన ఏం సెప్తిరి... ఏం సెప్తిరి డైలాగ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలో చెప్పిన డైలాగ్‌ను ఇమిటేట్ చేసిన‌ట్లు ఉంద‌న్న చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి. ఇక ప‌వ‌న్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలో చేసిన అంత్యాక్ష‌రి సీన్లో రాజ‌శేఖ‌ర్ హావ‌భావాల‌ను ఇమిటేట్ చేశాడ‌న్న టాక్ అప్ప‌ట్లో వ‌చ్చింది. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టాక రాజ‌శేఖ‌ర్ దంప‌తులు వ‌ర్సెస్ ప‌వ‌న్ మ‌ధ్య ఏదోలా వార్ న‌డుస్తూనే ఉంది. ఇక ఆ సినిమాలో ప‌వ‌న్ త‌న‌ను ఇమిటేట్ చేసినందునే ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ ఈ సినిమా ట్రైల‌ర్‌తోనే కౌంట‌ర్ ఇచ్చాడ‌ని అంటున్నారు. ఇక ట్రైల‌ర్‌లో రాజ‌శేఖ‌ర్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా మెప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: