యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి త్వరలోనే  ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది చిత్ర యూనిట్. ఇక మరోవైపు నాగార్జున ఈ సినిమాతో పాటు కొన్ని యాడ్స్ లో కూడా అప్పుడపుడు తళుక్కుమంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల కొన్నేళ్ల క్రితం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయి మంచి ఆదరణ సంపాదించిన మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 1 కు హోస్ట్ గా వ్యవహించిన నాగార్జున, ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టేశారు.

అందువలన ఆయనను ఒక ఏడాది నుండి మంచి సక్సెస్ ఫుల్ గా సాగుతున్న బిగ్ బాస్ షో కి సంబంధించి కొత్త సీజన్ అయిన సీజన్ 3 కి హోస్ట్ గా తీసుకోవాలని నిర్ణయించారట. ఇక దీనికి సంబంధించి ఆయనతో స్టార్ మా యాజమాన్యం అన్నివిధాలుగా సంప్రదింపులు జరపడం, అందుకు నాగ్ కూడా సమ్మతించడం కూడా జరిగిపోయాని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇకపోతే మరికొద్దిరోజుల్లో ఈ విషయమైన ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని తెలుస్తోంది. ఇక హోస్ట్ తో పాటు చాలావరకు షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక కూడా దాదాపుగా పూర్తి అయినట్లు చెపుతున్నారు. ఇక వారి వివరాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయట. 

ఇక బిగ్ బాస్ షో కి తొలి సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్, తన అద్భుత వాక్చాతుర్యంతో షో పై ఆసక్తిని మరింతగా పెంచారు. ఆపై సీజన్ 2 కి హోస్ట్ గా చేసిన నాని, దానిని మరింత పెంచినప్పటికీ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ చివరికి షో మంచి విజయవంతంగా పూర్తి అయింది. ఇకపోతే 3వ సీజన్ ని ఎలాగైనా ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయాలని భావించి, స్టార్ మా యాజమాన్యం వారు నాగ్ ను బరిలోకి దించనున్నట్లు సమాచారం. మరి వారు అనుకుంటున్నట్లు బిగ్ బాస్ సీజన్ 3 నాగ్ పర్యవేక్షణలో ఎంతవరకు విజయవంతం అయి ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందో రాబోయే మరికొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది....!!.  


మరింత సమాచారం తెలుసుకోండి: