అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ విషయమై రాజమౌళి చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అనేక పేర్లలో ‘రఘుపతి రాఘవ రాజారామ్’ ‘రామరావణ రాజ్యం’ టైటిల్స్ రాజమౌళి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సూచనతో తిరిగి రాజమౌళి మళ్ళీ ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ వైపు యూటర్న్ తీసుకున్నట్లుగా ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 

ప్రస్తుతం యూత్ అంతా ఎక్కువ ఇంగ్లీష్ పదాలకు కనెక్ట్ అవుతున్న నేపధ్యంలో పెద్దపెద్ద పదాలతో కూడిన టైటిల్స్ సినిమాలకు నప్పవనీ అందువల్ల ముందుగా అనుకున్నట్లుగానే ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ ను ఈమూవీకి అధికారికంగా ప్రకటించమని రాజమౌళికి కరణ్ జోహార్ సూచన ఇచ్చినట్లు టాక్. దీనికితోడు ఈమూవీ దేశంలోని చాల భాషలలో విడుదల అవుతున్న పరిస్థుతులలో సింపుల్ గా కనిపించే ఇంగ్లీష్ అక్షరాలతో కూడిన ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ చాల సులువుగా జనంలోకి మరింత వేగంగా వెళ్ళిపోతుందనీ కరణ్ జోహార్ రాజమౌళికి స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ జీవితాలను ప్రాతిపదికగా తీసుకుని నిర్మిస్తున్న ఈమూవీలో జూనియర్ చరణ్ పాత్రలతో సమానంగా అలియా భట్ పాత్రను కూడ రాజమౌళి పెంచుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈసినిమాకు హీరోలు చరణ్ జూనియర్ లు అయినా ప్రస్తుతం బాలీవుడ్ మార్కట్ లో అలియా భట్ కు కొనసాగుతున్న మ్యానియాను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

అయితే స్క్రిప్ట్ పరంగా చేస్తున్న ఈ మార్పులు చరణ్ జూనియర్ అభిమానులకు కొంతవరకు అసహనాన్ని కలిగించే నేపధ్యంలో రాజమౌళి వ్యూహాత్మకంగా తన సినిమాలో చరణ్ జూనియర్ లు కనిపించకుండా వారి పాత్రలు మాత్రమే కనిపిస్తాయి అంటూ లీకులు ఇస్తున్నట్లు సమాచారం. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ విషయమై ఇప్పటి వరకు కొనసాగిన కన్ఫ్యూజన్ కు రాజమౌళి తెర దింపినట్లు అయింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: