ఎన్నో అవకాశాలు ఉన్నా అదృష్టం అన్నది లేకుంటే ఏ వ్యక్తి రాణించలేడు అన్న విషయానికి స్పష్టమైన ఉదాహరణ అల్లు శిరీష్. ఇండస్ట్రీలో మంచి కథలను తయారు చేసుకుని తమకు అవకాశాలు ఇవ్వమని అడుగుతూ ఎందరో టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ లు ప్రస్తుతం అనేకమంది నిర్మాతలు చుట్టూ తిరుగుతున్న విషయం వాస్తవం.

ఇలాంటి పరిస్థుతులలో యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహించే విషయంలో దిల్ రాజ్ సురేశ్ బాబు అల్లు అరవింద్ ముందు వరసలో ఉంటున్నారు. అయితే ఇది అంతా బాగున్నా సమస్య అల్లు అరవింద్ దగ్గరే వస్తోందని టాక్. 

అరవింద్ కు కథ చెప్పి ఒప్పించడం ఒక సమస్య అయితే ఆతరువాత ఈ యంగ్ డైరెక్టర్లకు శిరీష్ సమస్య ఎదురౌతున్నదని ఇండస్ట్రీ వర్గాలలో జోక్స్ వినిపిస్తున్నాయి. కథ నచ్చిన తరువాత అరవింద్ ఆసినిమాను అల్లు శిరీష్ కు సరిపోయే విధంగా మార్పులు చేర్పులు చేయమని అడుగుతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఆ యంగ్ డైరెక్టర్లు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ అవకాశాన్ని శిరీష్ పై ప్రయోగించడం ఇష్టంలేక ఆ కథకు మరో యంగ్ హీరో సరిపోతాడు అని చెప్పినా అల్లు కాంపౌండ్ మాత్రం శిరీష్ పేరునే ముందుకు తీసుకు వస్తున్న నేపధ్యంలో ఆకథ చెప్పిన యంగ్ డైరెక్టర్స్ అందరికీ అయోమయ పరిస్థితి ఏర్పడి శిరీష్ కు తగ్గట్టుగా కథను మార్చుకు వస్తాము అని చెప్పి నెమ్మదిగా అల్లు కాంపౌండ్ నుండి జారుకుంటున్నట్లు సమాచారం. దీనితో భారీ నిర్మాణ సంస్థ అండ ఉన్నా చేతిలో చాల ధియేటర్లు ఉన్నా శిరీష్ కు దర్శకుడు దొరకని విచిత్ర పరిస్థితి ఏర్పడింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: