విశ్వ‌క్‌సేన్ అన్నీ తానై న‌డిపించిన ఫ‌ల‌క్‌నామా దాస్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాల‌కు మించి పెర్పామ్ చేస్తోంది. ప‌క్కా హైద‌రాబాదీ పాత‌బ‌స్తీ గ‌ల్లీ లైఫ్‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించిన ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి ఎలాంటి రివ్యూలు వ‌చ్చినా వాటితో సంబంధం లేకుండా మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది. ముఖ్యంగా నైజాంలో ఫ‌ల‌క్‌నామా ఫుల్‌స్వింగ్లో ఉంది.


ఈ సినిమాతో పాటు ఈ వీకెండ్‌లో వ‌చ్చిన అభినేత్రి, సూర్య ఎన్‌జీకే సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతో ఈ బ‌జ్‌ను క్యాష్ చేసుకుని దూసుకుపోతోంది. ఫ‌స్ట్ వీకెండ్ నైజాంలో ఈ సినిమా రూ.2 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. వీకెండ్ త‌ర్వాత మండే నుంచి కూడా వ‌సూళ్లు స్ట‌డీగా ఉన్నాయి. యూత్ ఈ సినిమాను బాగా చూస్తున్నారు. 


ఇక ఫ‌ల‌క్‌నామా దాస్ డిజిట‌ల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కు రూ. 2 కోట్ల‌కు అమ్మేశార‌ట‌. ఇంకా శాటిలైట్ రైట్స్ ఉన్నాయి. సినిమా ఓన్ రిలీజ్‌. ఆంధ్రా, సీడెడ్ వ‌సూళ్లు కూడా లాభ‌మే. ఇక టోట‌ల్‌గా సినిమా నిర్మాణానికి, ప‌బ్లిసిటీకి క‌లిసి రూ.5 కోట్లు అయ్యాయి. 


ఈ సినిమా రిలీజ్ చేసిన సురేష్‌బాబు ఇప్ప‌టికే రూ 2.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిన‌ట్టు వినికిడి. ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ ద్వారా రూ. 2 కోట్లు వెన‌క్కి వ‌చ్చేశాయ్‌. ఇక శాటిలైట్‌, ఏపీ, సీడెడ్ అమౌంట్లు కూడా క‌లుపుకుంటే మంచి లాభాలు రానున్నాయి. ఏదేమైనా తొలి సినిమాతోనే స‌క్సెస్ ఫుల్ నిర్మాత కం డైరెక్ట‌ర్‌గా హీరో విశ్వ‌క్‌సేన్ బాగా స‌క్సెస్ అయిన‌ట్టే.



మరింత సమాచారం తెలుసుకోండి: