ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమాకు ఏకంగా రూ. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కేక్కిస్తున్నారు. పాన్ ఇండియన్ మూవీగా సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ కాబట్టి క్యాస్టింగ్ కూడా అలాగే ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పై ప్రీ ఇంటర్వెల్ సీన్స్ తీస్తున్నారు.
నిన్ననే టాంజానియా నుంచి తిరిగి వచ్చిన రామ్ చరణ్.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. రామ్ చరణ్ పై కూడా కొన్ని కీలక సన్నివేశాలు తీసిన తరువాత ఇంటర్వెల్ సీన్స్ కు సంబంధించిన కీలక ఎపిసోడ్ చిత్రీకరణ ఉంటుంది. ఈ ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం.
ఒక్క ఎపిసోడ్ కోసం 45 కోట్లా అని అనుకోవచ్చు. రాజమౌళి సినిమా అంటే ఆ స్థాయిలోనే ఉంటుంది. పైగా ఇంటర్వెల్ సీన్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమా కాబట్టి అది మరింత హైస్థాయిలో ఉంటుంది. ఇక్కడ సస్పెన్స్ ఏమిటంటే.. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తారా లేదంటే.. ఒక్కరిపైనే ఉంటుందా అన్నది తెలియాలి.
ఒక్కరిపైనే ఈ ఎపిసోడ్ ను తీస్తే పెద్దగా కిక్ ఉండదు కాబట్టి ఇద్దరిపైనే షూట్ చేస్తారని సమాచారం. ఇద్దరిని ఎలా కలపబోతున్న అన్నది తెలియాలి. ఇంటర్వెల్ కోసం ఏకంగా 45 కోట్లు ఖర్చు చేస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది