రామ్ చరణ్ సతీమణిగా ఉపాసన మంచి గుర్తింపు తెచ్చుకుంది.  హెల్త్ కేర్ రంగంలో బిజీగా ఉన్న ఉపాసన.. బి పాజిటివ్ విత్ ఉపాసన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఇండియాలోని టాప్ సెలెబ్రిటీలతో చిట్ చాట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  మ్యాగజైన్ రూపంలో ఈ కార్యక్రమం పబ్లిష్ అవుతుంది.

ఇందులో భాగంగా బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ను ఇంటర్వ్యూ చేసింది.  సల్మాన్ ఇంటర్వ్యూ అంటే దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుంది.  సల్మాన్ ఇంటర్వ్యూ లో ఉపాసన అనేక ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా ఆరోగ్యం గురించి దిగిన ప్రశ్నలకు సల్మాన్ తెలివైన సమాధానాలు చెప్పాడట.

సల్మాన్ బాలీవుడ్ లో మోస్ట్ బ్యాచులర్ పర్సన్.  వయసు 50 దాటినా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.  దానిపై కూడా ఉపాసన కొన్ని ప్రశ్నలు సంధించింది.  భారత్ మూవీ ప్రమోషన్స్ కోసం చేసిన ఇంటర్వ్యూ కాబట్టి ఆ సినిమాకు సంబంధించిన కొన్ని సీక్రెట్ లు కూడా ఈ ఇంటర్వ్యూ లో ఉన్నాయి.

ఆ సీక్రెట్స్ ఏంటి.. ఎలాంటి ప్రశ్నలు సంధించింది అనే విషయాలు తెలియాలంటే మాత్రం పూర్తి ఇంటర్వ్యూ చూడాల్సిందే అని చెప్తూ ఇంటర్వ్యూ కు సంబంధించిన చిన్న ప్రోమోను రిలీజ్ చేసింది ఉపాసన.  ఇప్పుడు ఈ వీడియో ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: