క్రేజీ క్రికెటర్ క్రికెట‌ర్ జ‌స్ర్పీత్ బుమ్రా ద‌క్షిణాదికి క్రేజీ హీరోయిన్ హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ధ్య ప్రేమ వ్యహారం కొనసాగుతోంది అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక షాకింగ్ కధనం ప్రచురించడంతో వీరిద్దరి మధ్య ఏమి జ‌రుగుతోంది ? అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకు  వీరిద్ద‌రూ క‌లిసి బ‌య‌ట క‌నిపించ‌క పోయినా ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకు వచ్చాయి అన్నది ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

అయితే ఇలాంటి వార్తలు ఇలా పుట్టుకు రావడం వెనుక ఒక కారణం కనపడుతోంది. వీరిద్దరూ ఇప్పటివరకు కలసి పార్టీలకు పబ్బులకు వెళ్ళకపోయినా సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రూ ఒక‌ర్నొక‌రు ఫాలో అవుతున్నారు. బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక సినిమా న‌టి అనుప‌మ మాత్రమే  అంతేకాదు ఒక‌రు పెట్టే పోస్ట్‌కు మ‌రొక‌రు వెంట‌నే లైక్‌లు కొట్ట‌డం ఒక‌రి పోస్ట్‌ల‌ను మ‌రొక‌రు షేర్ చేయ‌డం త‌ర‌చుగా చేస్తున్నార‌ట‌.

దీనితో ఈ వ్యవహారాన్ని ఆధారంగా తీసుకుని జాతీయమీడియా వీరి వ్య‌వ‌హారంపై ఆసక్తికర కధనం ప్రచురించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్తలు ఇలా గుప్పు మనడంతో  వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అనుప‌మ‌ బుమ్రా త‌న‌కు మంచి స్నేహితుడు మాత్ర‌మేనని అంటూ క్లారిటీ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రికీ స్నేహం ఎలా ఎక్కడ ఎందుకు కుదిరింది అన్న సందేహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

సినిమా హీరోయిన్స్ క్రికెటర్లకు లింక్ చేస్తూ వార్తలు రావడం సర్వసాధారణం. ఒకనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని దగ్గర నుండి రాశీ ఖన్నా వరకు ఎందరో హీరోయిన్స్ ను క్రేజీ క్రికెటర్లతో లింక్ చేస్తూ వార్తలు రావడం ఒక పరిపాటి. అయితే మీడియా గాసిప్పులకు చాల దూరంగా ఉండే అనుపమా పరమేశ్వరన్ ఇప్పుడు నిజంగానే బుమ్రా ప్రేమలో పడిందా అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: