ప్రపంచవ్యాప్తంగా బుల్లితెర అభిమానులను ఉర్రూతలూగిస్తున్న బిగ్‌బాస్ సిరీస్ తెలుగులో ఫస్ట్, సెకండ్ పార్ట్‌లకు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు మించి ఆదరణ లభించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. తొలి సీజన్‌తోనే బుల్లితెర రేటింగ్లను బద్దలు కొట్టిన బిగ్ బాస్ రెండో సీజన్లో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ 3 కోసం భారీ ఎత్తున స్టార్ మా ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ 3 కార్యక్రమానికి టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారన్న వార్తలు ఈ ప్రోగ్రామ్‌ను మరింత ఆసక్తిగా మార్చేశాయి.
నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నాగార్జున బిగ్ బాస్ లాంటి కాంట్రవర్సీ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వస్తుండడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ కూడా బయటకు లీక్ అయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు యంగ్ హీరోలు ఈ సీజన్లో నటిస్తున్నారు.
ఇప్పటికే వరుణ్ సందేశ్, కమల్ కామరాజు, గుత్తా జ్వాల, తీన్మార్ సావిత్రి, సీరియల్ యాక్టర్ జాకీ లు ఈ షో కి ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీ ముఖి, కే ఏ పాల్ కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం ఉంది. షో నిబంధనల ప్రకారం బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే వరకు వారి పేర్లు బయట పెట్టకూడదన్న నిబంధన ఉంది. దీంతో అఫీషియల్‌గా వీరి పేర్లు బయటకు రావడం లేదు.