యంగ్ హీరో నిఖిల్ కి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆయన తాజా చిత్రం " అర్జున్ సురవరం " టైటిల్ దగ్గరి నుండి కష్టాలు స్టార్ట్ అయ్యాయి.  ఈ సినిమా ఇప్పటికే ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి మే నెలలో విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు.

 

లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...నిఖిల్ కమిటైన మరో మూవీ రద్దయ్యే పరిస్థితిలో ఉందట. నిఖిల్ హీరోగా కొన్ని నెలల క్రితం 'శ్వాస' అనే చిత్రం ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇపుడు ఈ సినిమా క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.నిఖిల్, నివేదా థామ‌స్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

శ్రీ తేజ్ ఫిలిం ఫ్యాక్ట‌రీ, రెడ్ స్కై ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై కిషన్ క‌ట్టా అనే యంగ్ డైరెక్టర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తేజు ఉప్ప‌లపాటి, హ‌రినికేష్ రెడ్డి నిర్మాతలుగా గతేడాది అక్టోబర్లో 'శ్వాస' ప్రారంభోత్సవం జరుపుకుంది.అప్పట్లో ఈ ప్రారంభోత్సవానికి శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరైన ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. జెమిని కిర‌ణ్‌, న‌రేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. క్రిష్ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 

అయితే ఏమైందో తెలియదు కానీ ఇపుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితిలో ఉందట.ఇక అర్జున్  సురవరం విషయానికొస్తే ఇది తమిళంలో హిట్ అయిన కనితన్ చిత్రానికి రీమేక్. టి.ఎన్ సంతోష్ దర్శకుడు. ఇదే దర్శకుడితో తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు ముఖ్య పాత్రల్లో రీమేక్ అయింది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఏది ఏమైనా నిఖిల్ కి ప్రస్తుతం కష్టంలో ఉన్నాడని మాత్రం తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: