నాపేరు సూర్య తరువాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు.  ఇంకా దీనికి పేరు పెట్టలేదు.  బన్నీతో త్రివిక్రమ్ చేసిన రెండు సినిమాలు ఫాదర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కినవే.  ఈ సినిమా కూడా అదే తరహాలో ఉండబోతున్నది.  


ఇప్పటికే షూటింగ్ ను చాలా వరకు పూర్తి చేశారు.  గ్యాప్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నారు.  ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు బన్నీ.  బన్నీతో చేస్తున్న మూడో సినిమా కాబట్టి కాంబినేషన్లో మూడో హిట్ కోసం త్రివిక్రమ్ ట్రై చేస్తున్నారు. 


ఇక, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.  అరవింద సమేత సినిమాతో తాను ఎలాంటి కథకైనా సంగీతం అందించగలను అని నిరూపించుకున్నాడు.  ఈ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారట థమన్.  మాస్ ను అలరించే సాంగ్స్ ఉండబోతున్నాయట.  


థమన్ కెరీర్లో బెస్ట్ ట్యూన్స్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.  సినిమా విజయంలో ఈ ట్యూన్స్ తప్పకుండా ఒక మైలేజ్ గా ఉంటుందని అంటున్నారు.  థమన్ అంతగా చెప్తున్నాడు అంటే విషయం ఉండే ఉంటుంది.  మరి ఆ విషయం ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: