బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఈ మధ్య బాలీవుడ్ లో సినిమాలు తగ్గించి హాలీవుడ్ బాట పట్టింది ఈ భామ. "బే వాచ్" లాంటి హాలీవుడ్ సినిమాల్లో నటించి, మెప్పించింది. అయితే ప్రియాంక చోప్రా నిక్ జొనాస్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం చేసుకున్నప్పటి నుండి ఆమె ఇంత వరకు చీర కట్టులో కనిపించలేదు.

 

మొదటిసారి ఆమె చీర కట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్లి తర్వాత ప్రియాంక చీర కట్టులో కనిపించనేలేదు..ఎప్పుడు సరికొత్త ఫ్యాషన్ తో ఆకట్టుకునే హాట్ హాట్ అందాలతో క్లివేజ్ సొగసులతో సెగలు పుట్టిస్తూ వస్తుంది. ఎప్పుడెప్పుడు చీర కడుతుందో అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టైలిష్ చీర కట్టులో కనిపించి కనువిందు చేసింది .

 

ఫ్రాన్స్ లో హాలీవుడ్ నటి వివాహానికి ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనస్ లు హాజరయ్యారు. ఈ వేడుకకు ప్రియాంక చోప్రా లైట్ కలర్ నెట్ శారీతో ఆకట్టుకోగా.. నిక్ జోనస్ బ్లాక్ కలర్ సూట్ లో అదరకొట్టాడు. చాలా రోజుల తరువాత ప్రియాంక శారీ లుక్ లో కనిపించేసరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 

ప్రియాంక చోప్రా ప్రస్తుతం న్యూయార్క్ లో సెటిల్ అయ్యింది. హాలీవుడ్ లో పలు టీవీ సిరీస్ లు చేస్తూ నటిగా బిజీగా మారిపోయింది. అయితే మేడం టుస్సాడ్ మ్యూజియంలో ప్రియాంక చోప్రా మైనపు బొమ్మ ఆవిష్కరించనున్నారని సమాచారం. దాని కోసం ఆమె కొలతలు కూడా తీసుకొన్నట్లు తెలుస్తుంది. మరి ఆ బొమ్మను ఎప్పుడు పూర్తి చేస్తారో..ఎప్పుడు మ్యూజియంలో పెడతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: