ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే.. మిగతా హీరోల సినిమాలు పక్కకు తప్పుకుంటాయి.  ఫలితంగా రిలీజైన పెద్ద సినిమాకు పెట్టిన డబ్బులు వచ్చేస్తుంటాయి.  ఇది ఎప్పటి నుంచో వస్తున్నదే.  ఒకరిపై ఒకరికి ఉండే అవగాహనతో ఇలా జరుగుతుంటుంది.  సంక్రాంతి సీజన్ కాబట్టి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.  


వచ్చే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి.  ఒకటి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ కాగా, రెండో సినిమా అల్లు అర్జున్ మూవీ.  సరిలేరు నీకెవ్వరూ పక్కా ఎంటర్టైనర్ గా రాబోతున్నది.  దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  అనిల్ రావిపూడి దర్శకుడు.  సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు.  డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు.  


అటు అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని షూట్ చేస్తున్నారు.  ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతిని మిస్ కానివ్వమని చెప్పేశారు. సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నట్టు చెప్పేశారు.  అయితే ఈ మూవీ కూడా డేట్ ను అనౌన్స్ చేయలేదు.  సో, రెండు సినిమాలు సంక్రాంతికే వస్తున్నాయి.  


మంచిదే కాకపొతే... రెండు సినిమాల మధ్య కొద్దిగా గ్యాప్ తీసుకుంటే మంచిది అన్నది విశ్లేషకుల అభిప్రాయం.  వచ్చే ఏడాది సంక్రాంతి మంగళ, బుధ, గురు వారాల్లో వచ్చింది.  దీనికి ముందు అంటే జనవరి 10 వ తేదీ శుక్రవారం రోజున ఒక సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు.  జనవరి 14 వ తేదీన మరో సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు.  అయితే, ఎవరి సినిమా ముందు రిలీజ్ అవుతుంది.. ఎవరి సినిమా లేట్ గా రిలీజ్ అవుతుంది అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: