హీరోల మధ్య పోటీ పెరిగి పోవడంతో విభిన్నంగా కనిపించాలని హీరోలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. బొద్దుగా ఉండే బాలకృష్ణ తన కొత్త సినిమా ‘లెజెండ్’ కోసం దాదాపు ఎనిమిదిన్నర కేజీల బరువు తగ్గాడు అనే వార్త టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారింది. అంతేకాదు ఒక వెరైటీ లుక్ కోసం తన చెవులకు రింగులతో వెరైటీగా బాలయ్య ఈ సినిమా కనిపిస్తాడట. బాలకృష్ణ లాంటి అనూహ్యమైన మాస్ ఇమేజ్ ఉన్న కథానాయకునితో ఆంధ్రప్రదేశ్ లో అవుడ్డోర్ షూటింగ్ అంటే చాల కష్టమైన వ్యవహారం పైగా వైజాగ్ లాంటి మహానగరంలో వేలాది జనాల సాక్షిగా అంటే అదొక సంచలనమే.

అలాంటి సాహసానికే పూనుకున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకునిగా రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ను 45 రోజుల పాటు వైజాగ్‌లో జరుపనున్నారాయన. అక్కడ పది రోజుల పాటు విశాఖ నగర ప్రధాన వీధుల్లో బాలకృష్ణపై పోరాట సన్నివేశాలు, కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు బోయపాటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడా రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి వైజాగ్ షెడ్యూల్ మొదలవుతుందిఅని తెలుస్తోంది.

ఇదిలావుంటే ఈ సినిమాలో బాలకృష్ణ రెండు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో ఓ గెటప్ కోసం తయారు చేసిన విగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. ఫిఫ్టీ ప్లస్‌లో బరువు తగ్గడం అంటే నిజంగా సాహసమే అంటున్నారు. సాహసానికి రాయించారు అని తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసింది కాబట్టి ఉత్తరాంద్ర లో తన ఇమేజ్ ను పెంచుకోవడానికి బాలకృష్ణ ఇంత భారీ షెడ్యుల్ విశాఖపట్నంలో ప్లాన్ చేసాడు అని విశ్లేషకులు అంటున్నారు. ఎదిఎలా ఉన్నా బాలయ్య ప్రస్థుత పరిస్థుతులలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: