ప్రస్థుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అందరి దృష్టి ఈనెల 30న విడుదలకాబోతున్న ‘సాహో’ పై ఉంది. ఈమూవీ విడుదలకు కేవలం 23రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈమూవీకి రాబోతున్న కలెక్షన్స్ రికార్డుల పై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఈమూవీకి రెండువందల కోట్లకు పైగా బడ్జెట్ అవడంతో ఈమూవీ బిజినెస్ 35oకోట్ల రేంజ్ లో బిజినెస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఈమూవీ బయ్యర్లు లాభాల బాట పట్టాలి అంటే ఈమూవీకి కలెక్షన్స్ 500 కోట్లు దాటితేనే ‘సాహో’ కమర్షియల్ గా సేఫ్ ప్రాజెక్ట్ అనిపించుకుంటుంది. ఈమూవీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేస్తుంది అన్న అంచనాలు మొదలయ్యాయి. ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం  ‘సాహో’ మొదటిరోజు ఒక్క తెలుగు వెర్షన్ నుంచే 125 కోట్ల దాకా వసూళ్లు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.  

ఇక హిందీ వెర్షన్ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అత్యధిక కేంద్రాల్లో రిలీజవుతుంది కాబట్టి మొదటిరోజు కలెక్షన్స్ 200 కోట్ల స్థాయిలో ఉండగలిగితే ఈమూవీ ఫైనల్ రన్ అయ్యేలోపు 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలనే ఆలోచనలో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు టాక్.   ఇప్పుడు ఈ అంచనాలు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలకు లీక్ కావడంతో నిజానికి ఇదంతా జరిగే పనేనా అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

గతంలో ‘బాహుబలి’ ఇలాంటి రికార్డులు క్రియేట్ చేసింది అన్న ప్రాతిపదిక ఉన్నా ఆమూవీ ఫాంటసీ మూవీకావడమే కాకుండా ఏనాడో జనం మర్చిపోయిన రాజుల కధకు గ్రాఫిక్స్ తోడవ్వడంతో ఇలాంటి అద్భుతాలు జరిగాయని అలాంటి అద్భుతం ఒక యాక్షన్ ఫిలింగా ముద్ర పడిన ‘సాహో’ కి ఎలా వస్తుంది అంటూ కొందరు ట్రేడ్ పండితులు ప్రశ్నిస్తున్నారు. టాక్ యునానిమస్ గా వస్తే ఎలాంటి సమస్య ఉండదు కాని అనుకోకుండా ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా ‘సాహో’ బయ్యర్లు ఘోరంగా నష్టపోయే ఆస్కారం ఉంది అంటూ కొత్త ప్రచారానికి తెర తీస్తున్నారు.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: