మహేశ్ బాబు కెరీర్ లో పోకిరి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ సినిమాతోనే మహేశ్ సూపర్ స్టార్ అయ్యాడు. 2006లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను నెలకొల్పింది. అయితే.. ఆ సినిమా చేయాలని తానే పూరీకి సలహా ఇచ్చానని దర్శకుడు మెహర్ రమేశ్ అంటున్నాడు. అంతే కాదు.. మహేశ్ తో తనకున్న అనుబంధాన్ని కూడా నెమరవేసుకుంటున్నాడు.

 

 

రాజకుమారుడు సమయంలో మహేశ్ సోదరి మంజుల ద్వారా మొదటిసారి మహేశ్ ను స్కూకర్ బిజినెస్ ప్రపోజల్ విషయంలో కలిసాడట. తర్వాత బాబీ సినిమాకు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ గా చేస్తూ మహేశ్ ఫ్రెండ్ గానూ నటించాడు. తరువాత పూరి సినిమాకు అసిస్టెంట్ గా చేస్తున్న సమయంలో పోకిరి సినిమాను మహేశ్ తో చేయాలని తానే పూరికి సలహా ఇచ్చినట్టు చెప్తున్నాడు. తాను ఒక్కడు కన్నడ రీమేక్ పనుల్లో బెంగళూరులో ఉన్నప్పుడు తనకోసమే పూరీ-మహేశ్ బెంగళూరు వచ్చారని ముగ్గురం పార్టీ చేసుకున్నామని అంటున్నాడు. మహేశ్-నమ్రత పెళ్లికి ముందే నమ్రత తెలుసని వారి పెళ్లికి మహేశ్ ఫ్యామిలీ కాకుండా హైదరాబాద్ నుంచి వెళ్లింది తానొక్కడినేనని చెప్పుకొచ్చాడు. ఆమధ్య నమ్రత తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు కూడా నమ్రత ఫ్యామిలీకి తోడుగా మెహర్ రమేశే వెళ్లాడు.

 

 

మెహర్ రమేశ్ మెగాస్టార్ చిరంజీవికి బంధువు. తొలిప్రేమ సినిమాలో పవన్ తన ఫ్రెండ్స్ తో స్నూకర్ ఆడే సన్నివేశాన్ని మెహర్ చెప్తేనే కరుణాకర్ తీశాడని ఓసారి చెప్పాడు. ఆ సమయంలో విజయవాడలో మొట్టమొదటి స్నూకర్ సెంటర్ మెహర్ రమేశే ఏర్పాటు చేసి ఆ సంఖ్య 12కు పెంచాడు. అదే బిజినెస్ వ్యవహారంలో తాను మంజులను, తర్వాత మహేశ్ ను కలుసుకున్నానని అంటున్నాడు. మహేశ్ తో అప్పటి నుంచి ఉన్న అనుబంధం పెరిగి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామని అన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: