సాధారణంగా హాలీవుడ్ నటీమణులు న్యూడ్ గా ఫోజులు ఇస్తుంటారు.  కొన్ని కొన్ని కార్యక్రమాల కోసం ఇలా ఫోజులు ఇవ్వడం పరిపాటి.  దానికోసం చాలా తీసుకుంటారు అందులో సందేహం అవసరం లేదు.   డబ్బుతో పాటు వాళ్లకు పేరు కూడా వస్తుంది.  అందుకే అలాంటివి చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.  అయితే, బాలీవుడ్ కు చెందిన కొందరు కూడా ఇలా నగ్నంగా ఫోజులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు.  


అయితే, వారి పేరు చాలా తక్కువగా బయటకు వస్తుంది.  ఎందుకంటే ఇండియాలో ఇలా ఫోజులు ఇస్తే దానిపై సర్వత్రా విమర్శలు వస్తాయి.  అందుకే వాటికి దూరంగా ఉంటారు.  హీరోయిన్లు కాకుండా సోషల్ వర్కర్లు, ఇతర రంగాలకు చెందిన వాళ్ళు కూడా ఇలా ఫోజులు ఇవ్వడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.  కానీ ఓ క్రికెటర్ నగ్నంగా ఫోజులు ఇవ్వడం ఎప్పుడైనా చూశారా.  మగవాళ్ళు నగ్నంగా ఫోజులు ఇవ్వడం ఏంటి అని షాక్ అవ్వకండి. 

అక్కడ ఫోజులు ఇచ్చింది మహిళా క్రికెటర్.  ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్ విమెన్ సారా టేలర్.  మహిళల శరీరం, ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహనా కల్పించేందుకు ఇలా చేసినట్టు సారా టేలర్ పేర్కొంది.  సారాకు ఓ మానసిక వ్యాధి ఉన్నది.  దేనికైనా సరే అతిగా స్పందించడంతో పాటు అతిగా ఆతృత చెందుతుంది.  దీని వలన ఆమె చాలా రోజులు క్రికెట్ కు దూరంగా కూడా ఉన్నది.  


2016 లోను ఇలాగే కొన్ని రోజులు క్రికెట్ కు దూరంగా ఉన్నది.  ప్రస్తుతం సారా సర్రే స్టార్స్ క్రికెట్ జట్టు తరపున క్రికెట్ ఆడుతున్నది.  మైదానంలోకి దిగింది అంటే పరుగుల వరద పారించడమే తెలుసు.  ఇదిలా ఉంటె, ఈమెను ఇంగ్లాండ్ కు చెందిన విమెన్ హెల్త్ యూకే ఆహ్వానం పలికింది.  మహిళల ఆరోగ్యం గురించిన విషయాలలో మహిళలకు అవగాహనా కల్పించే కార్యక్రమానికి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు.  ఇదిలా ఉంటె, ఈ క్రికెటర్ ఇటీవలే సోషల్ మీడియాలో  నగ్నంగా ఉండే ఫోటోను షేర్ చేసింది.  అవగాహనా కోసమే ఈ ఫోటోను షేర్ చేసినట్టు చెప్పింది ప్రస్తుతం ఈ ఫొటోకు లక్షల సంఖ్యలో లైక్ లు వస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: