సినీ పరిశ్రమంలో ఈ మద్య కొంత మంది హీరోయిన్లు తమపై లైంగిక వేధింపులు జరిగాయని బాహాటంగానే వెల్లడిస్తున్నారు.  బాలీవుడ్ లో మీటూ ఉద్యమం నేపథ్యంలో త‌ను శ్రీ ద‌త్తా పెద్ద బాంబే పేల్చారు. సీనియర్ నటుడు నానా పటేకర్ గతంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పపడ్డారని..మానసికంగా వేధించారని ఆరోపణలు చేసింది.  అప్పటి వరకు నానా పటేకర్ పై ఎలాంటి ఆరోపణలు లేవు..అయితే త‌ను శ్రీ ద‌త్తా చేసిన ఆరోపణలతో బాలీవుడ్ ఒక్కసారే కంపించింది.   

ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2008లో `హార్న్ ఓకే ప్లీజ్‌` సినిమా స‌మ‌యంలో నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారని ఆమె తెలిపారు.  బాలీవుడ్ నుండి ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌కు పాకింది. చిన్మయి వంటి వారు ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేశారు. అంతే కాకుండా చాలా మంది మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలో కన్నడ బ్యూటీ  శృతి హరిహరన్ యాక్షన్ హీరో అర్జున్ పై లైంగిక వేధింపులు చేశాడని ఆరోపించడమే కాదు కేసు కూడా పెట్టింది.

రొమాంటిక్ సీన్లలో నటించే సమయంలో తనను చిత్రహింసలు పెట్టాడని, దర్శకుడితో కలిసి అసభ్య వ్యాఖ్యలు చేశాడని ఆరోపించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన అర్జున్ పై ఇలాంటి వివాదం మొదటి సారిగా రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.  ఈ వివాదం పెద్దది కావడంతో కన్నడ చిత్రపరిశ్రమ ప్రముఖులు జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. కానీ శృతి హరిహరన్ ఏమాత్రం తగ్గలేదు..పైగా తనను కొంత మంది బెదిరిస్తున్నారని ఆరోపణ కూడా చేసింది. ఈ కేసుల కారణంగా అర్జున్ పోలీస్ స్టేషన్ కు కూడా హాజరవుతూ వస్తున్నాడు. మరోవైపు శృతి హరిహరన్ పై అర్జున్ కుటుంబ సభ్యులు పోలీస్ కేసు నమోదు చేశారు.

తమ తండ్రిపై లేని పోని ఆరోపణలు చేస్తూ ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని..పరువు నష్టం కింద శృతి హరిహరన్ పై కేసు పెట్టారు. అంతే కాదు ఐదు కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతున్న సమయంలో తనపై లేని పోని అబాండాలు వేస్తున్నారని  ఆ కేసులు చెల్లవని శృతి మరోసారి కోర్టుకి వెళ్లింది. అయితే కేసును కొట్టేయాలని శ్రుతి పెట్టిన పిటిషన్ ని కోర్టు కొట్టిపారేసింది. కేసు కొనసాగుతుందని కోర్టు వెల్లడించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: