ఓవర్ నైట్లో సెన్షేనల్ క్రియేట్ చేసిన స్టార్ అంటే మనకు టక్కున తట్టే పేరు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ రొమాంటిక్ హీరో అని అందరిచేత పిలిపించుకున్నారు. ఆ తర్వాత నుండి ఈయన వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. నిజానికి ఈయన సినిమా కెరీర్ మొదలైంది పెళ్లిచూపులు సినిమాతో అయిన బాగా క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమా అయితే అర్జున్ రెడ్డి.

విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక బ్రాండ్ . తన నటన కంటే తన స్పీచెస్ , కామెంట్స్ తో యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. విజయ్ దేవరకొండ యూత్ కి ఒక రౌడీ. తన సినిమాలని ప్రమోట్ చేసుకోవడం లో మన దేవరకొండ స్టయిలే వేరు. విజయ్ స్పీచ్ అభిమానులకి కొండంత ఉత్సాహాన్ని ఇస్తుంది. అర్జున్ రెడ్డి , గీత గోవిందం సినిమాలు హీరో గా ఒక స్థాయిని పెంచితే , అభిమానుల్లో తన స్థాయిని పెంచిన ఒక ఐదు అరాచకమైన స్పీచెస్ ను మీ ముందుకు తీసుకు వస్తున్నాం.

అర్జున్ రెడ్డి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ :

ఈయన సినిమాలలో మోస్ట్ పాపులర్ సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అదేంటంటే డాక్టర్ల బ్రతుకులు మారవా అంటూ మాట్లాడి, ముందే సినిమా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ బ్యాక్ లాక్ స్టూడెంట్స్ అని మాట్లాడటం, అందరి మధ్యలో ఉండి కూడా వాడకూడని పదాలు వాడటంతో అందరికి షాక్ ఇచ్చాడు.

 గీత గోవిందం ఆడియో లాంఛ్:

గీత గోవిందం ఆడియో లాంచ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ పాడిన పాట మీదొచ్చిన కామెంట్లకు,విజయ్ చేసిన ట్రోల్ల్స్ వైరల్ అయ్యాయి. నేను పాడిన పాట నచ్చలేదా..మీరు పాడి పంపండి. నేను చూస్తాను అనే మాటలు అందరికి ఆలోచింప చేశాయి. 
నోటా ప్రీ రిలీజ్ ఈవెంట్ :

నోటా సినిమాలో ఈయన పొలిటిషన్ అలాగే సీఎం గా చేసారు . ఈ రెండు రాష్ట్రాలకు ఒకే పొలిటిషన్ ఒకే సీఎం . నోటా సినిమా మీద చాలా కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి . ఇది ఒక పార్టీ కి అనుకూలమైన సినిమా అని .. అప్పుడు మన దేవరకొండ స్పీచ్ ఇచ్చిన పొలిటికల్ అదిరిపోయింది.
టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్:

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడినటువంటి మాటలు కొందరిని నొప్పించాయి .దానికి తోడు బన్నీ మాటలు విజయ్ కి ఊపునిచ్చాయి. అలా విజయ్ మాటలు వైరల్ అయ్యాయి.
ఏ ఈవెంట్ కు విజయ్ వెళ్లిన కూడా మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ మైక్ పట్టుకొన్నపటి నుండి ఎండ్ అయ్యేవరకు అదిరిపోయే మాటలతో అదరకొట్టే విజయ్ దేవరకొండ మొన్న జరిగిన సైమా అవార్డ్స్ లో సైలెంట్ గా ఉన్నాడు విజయ్ మరి ఈ ఈవెంట్లలో జరిగిన సమస్యల వల్లే విజయ్ సైలెంట్గా ఉన్నారని అర్థమవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: