బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ సాహూ చిత్రం  నెల 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున  విడుదలకి సిద్ధమౌతోంది.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమా ప్రారంభం నుండే ఈ సినిమాపై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. దానికి తోడు సినిమా నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ , టీజర్స్ , ట్రైలర్స్ అన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులని అలరించడంతో అందరిలోను సినిమా చూడాలనే కుతూహలం పెరిగిపోయింది.

ఈ సినిమాని టాలీవుడ్ యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించాడు. తెలుగు తో పాటుగా తమిళం , మలయాళం , హిందీ భాషలలో విడుదల కాబోతుంది. ఇక పొతే సాహో రిలీజ్ కావడానికి ముందే రికార్డులను కొల్లగొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, అంచానలను మరింత పెంచేసింది. మరోవైపు పారిస్ లోని ప్రతిష్ఠాత్మక థియేటర్ లి గ్రాండ్ రెక్స్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. లి గ్రాండ్ రెక్స్ థియేటర్‌ను 1932లో ప్రారంభించారు.. అప్పటినుండి అనేక ప్రఖాత్య సాంస్కృతిక, కళా, సినిమా ప్రదర్శనలకు వేదికగా మారిపోయింది.  


వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ థియేటర్ యూరప్ లోనే అతి పెద్దది. ఈ థియేటర్ లో ఒకేసారి 2800 మంది సినిమాను వీక్షించవచ్చు. ఇప్పటి వరకు రజనీకాంత్ నటించిన కబాలి, విజయ్ నటించిన మెర్సెల్, ప్రభాస్ నటించిన బాహుబలి దక్షిణాది చిత్రాలు మాత్రమే ఈ థియేటర్ లో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు సాహో కూడా ఆ థియేటర్ లో ప్రదర్శించనుండటంతో... ఆ థియేటర్ లో రెండు సినిమాలను విడుదల చేసిన తొలి దక్షణాది హీరోగా ప్రభాస్ రికార్టు  సృష్టించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి వస్తున్నా హైప్ చూస్తుంటే బాహుబలి కలెక్షన్స్ ని దాటేస్తుందా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 10 వేలకి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: