350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా ఈరోజు విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని 95 శాతం థియేటర్లలో సాహో సినిమా విడుదలైంది. సాహో సినిమా టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పది వేల థియేటర్లకు పైగా విడుదల కావటం విశేషం. 
 
బాహుబలి, బాహుబలి 2 లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల తరువాత ప్రభాస్ నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఫలితం విషయానికి వస్తే ఈ సినిమా అబవ్ యావరేజ్ నుండి హిట్ స్టేటస్ మధ్యలో ఉంది. దర్శకుడు చేసిన కొన్ని పొరపాట్లు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసాయి. సినిమా కథ, కథనంపై మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా ఖచ్చితంగా మరో స్థాయికి చేరే అవకాశం ఉండేది. 
 
సాహో సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సులు, సెకండాఫ్, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ సినిమాకు ప్లస్ కానున్నాయి. ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జోడీ బాగుంది. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు అద్భుతంగా ఉన్నాయి. తొలి రోజు వసూళ్ళలో బాహుబలి2 రికార్డ్ సాహో టచ్ చేయకపోయినప్పటికీ నాన్ బాహుబలి రికార్డ్ మాత్రం అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మేజర్ ఏరియాలలో నిన్న అర్ధరాత్రి నుండే సాహో షోలు ప్రారంభం కాగా చాలా చోట్ల ఈరోజు ఉదయం నుండి సాహో షోలు మొదలయ్యాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చే అవకాశం ఉంది. మొదటి మూడు రోజుల్లో సాహో 200 కోట్ల రుపాయల షేర్ వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: