ఓ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడటం వేరు, అంచనాలు క్రియేట్ చేయటం వేరు. ప్రభాస్ హీరోగా దేశవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన సాహో పరిస్థితి ఇలానే ఉంది. కథ లేకుండా కేవలం టేకింగ్ మీదే ఆధారపడితే ఫలితం ఇంతేనని సాహో నిరూపించింది. ప్రభాస్ మొన్నటి ఇంటర్వ్యూలో 'స్క్రీన్ ప్లే మీద ఆధారపడిన సినిమా ఇది' అని చెప్పినప్పుడు అర్థం చేసుకోలేకపోయామని ఇప్పుడు అనుకుంటున్నారు.

 

 

ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ లో ఖాన్ లకు పోటీ ఇచ్చేస్తున్నాడు.. అంటూ ప్రభాస్ ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది మీడియా. ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే తాపత్రయమో.. ఈ క్రేజ్ తో సినిమా ఎలా ఉన్నా చూస్తారనే ధైర్యమో కానీ నిర్మాతలు ఇంత భారీ బడ్జెట్ పెట్టారు. కానీ ప్రేక్షకుడిని మాత్రం 2గంటల 50 నిమిషాలు సీట్లో కూర్చోబెట్టలేకపోయారు. చిన్న పాయింట్ ని కథగా మలచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను దర్శకుడు తీసుకోలేకపోయాడని అంటున్నారు. ఇక్కడ యాక్షన్ సీన్లపై పెట్టిన దృష్టి కథనంలో పెట్టలేదని ప్రభాస్ ఫాన్స్ నిరుత్సాహంలో పడిపోయారు. కామెడీ, సాంగ్స్, కథ ఏమీ ఆకట్టుకునే విధంగా లేకుండా సినిమా తీసిన సుజిత్ ను తప్పుబట్టాలో, సుజిత్ ను నమ్మిన ప్రభాస్ ని అనాలో అర్ధంకాని పరిస్థితి,

 


ఆమధ్య పూరీ జగన్నాధ్.. “ఒక సూపర్ హిట్ ఇవ్వగానే మన చుట్టూ చేరిపోతారు, ఉక్కిరిబిక్కిరి చేసి మనం ఆలోచించుకునేలోపే మనతో వెంటనే ఓ ఫ్లాప్ ఇప్పించేసి, తేరుకునేలోపు కనిపించకుండా వెళ్లిపోతారు” అని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ పరిస్థితి ఇలానే తయారైంది. వీకెండ్ తర్వాత మరింత కష్టమంటున్నారు. అసలే రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ల రేట్లు కూడా పెంచనీయలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: