పవన్ కళ్యాణ్ కు సినిమాలు అంటే విరక్తి కలిగి రాజకీయాల బాట పట్టే విధంగా ‘అజ్ఞాతవాసి’ ఘోరపరాజయం పవన్ కు బ్రెయిన్ వాష్ చేసింది. ఇప్పుడు ‘సాహో’ కు జాతీయ మీడియా నుండి స్థానికి మీడియా వరకు ఇస్తున్న రేటింగ్స్ చూస్తుంటే కొంత కాలం పాటు ప్రభాస్ కూడ తన సినిమాలకు గ్యాప్ ఇస్తాడా అని అనిపించడం సహజం. 

ప్రస్తుతం ప్రభాస్ జిల్ రాధకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ కూడ పూర్తి అయింది. ఒక క్యూట్ లవ్ స్టోరీగా ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాను కూడ పెద్దగా పేరు అనుభవం లేని దర్శకుడు తీస్తున్నాడు. దీనితో ప్రభాస్ ‘సాహో’ ఫలితం తరువాత ఈ మూవీని కొనసాగిస్తాడా లేకుంటే ఈ మూవీ కథలో భారీ మార్పులు చేస్తాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

వాస్తవానికి ‘సాహో’ రిలీజ్ తరువాత కొద్ది గ్యాప్ తీసుకుని అక్టోబర్ నుండి ఈమూవీ షూటింగ్ కొనసాగించి వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ మూవీని రిలీజ్ చేస్తారు అని భావించారు అంతా. అయితే ‘సాహో’ ఫలితంతో ప్రభాస్ ఆలోచనలు మారిపోయి ఈ మూవీ విషయమై ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అన్న ఆసక్తి పెరిగిపోతోంది. 

నిన్న ‘సాహో’ విడుదల రోజున గూగుల్ సర్చ్ లో ‘వరల్డ్ సాహో డే’ ‘సాహో రివ్యూ’ ‘సాహో ఫీవర్’ లాంటి హ్యాష్ ట్యాగ్స్ పై విపరీతంగా సెర్చ్ జరగడంతో నిన్నటి గూగుల్ ట్రెండింగ్స్ లో టాప్ స్థానంలో నిలిచింది ‘సాహో’. ఇలాంటి టాప్ స్థానం నుండి ఒకేసారి ఈ మూవీ చూడటానికి కూడ భయపడే మూవీ స్థాయిలో ‘సాహో’ ను పోలుస్తూ రివ్యూలు వస్తున్నాయి అంటే ప్రభాస్ తన భవిష్యత్ సినిమాల ఎంపిక విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయి అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: